Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్గ్రెస్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

గ్రెస్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

గ్రెస్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం
డాక్టర్ నిర్లక్షంతో పసికందు కన్ను తెరవకుండానే మృతి
తక్షణమే హాస్పిటల్ మూసివేయాలి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన
వైద్యం వికటించి ఇప్పటికి ముగ్గురు మృతి చెందిన హాస్పిటల్
ఇంత దారుణం జరుగుతున్నా వైద్యశాఖ గ్రెస్ మల్టి స్పెషాలిటీ హాస్పటల్ పైన చర్యలు ఏవి…
గ్రెస్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కు పర్మిషన్ ఉందా… పలు అనుమానాలు
తుక్కుగుడ/మహేశ్వరం జనవరి 21 (ప్రజాకలం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం
దుబ్బచెర్ల గ్రామానికి చెందిన పుట్టగళ్ల మాధవి (21) భర్త ప్రశాంత్ కు 9 నేలలు నిండడంతో సమీపంలోని తుక్కుగుడ శ్రీశైలం హైవేలో వున్నా గ్రేస్స్ ఆసుపత్రి తీసుకొచ్చారు. అయితే వైద్యం చేయల్సిన డాక్టర్… నిర్లక్షంతో పసి కందు బాబు ప్రాణలు తీసారని బాధితులు ఆరోపించారు. బాధితులు ప్రశాంత్ మాట్లాడుతూ నార్మల్ డెలివరీ అయ్యిందని బాబు పుట్టాడు అని చెప్పి తర్వాత కొంచం సేపటికి బాబు చనిపోయాడని డాక్టర్ చెప్పి మళ్ళీ నిలోఫర్ హాస్పిటల్ కు తీసుకవెళ్లండి అని డాక్టర్   నీలోఫర్  వెళ్లాలని రిఫర్ చేశారు. నిలోఫర్ డాక్టర్ బాబుని చూసి అప్పటికే చనిపోయాడని చెప్పారు.  దీనితో ఆగ్రహించిన బంధువులు గ్రెస్ హాస్పిటల్ ముందు డాక్టర్  పై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
డాక్టర్ లైసెన్సు రద్దు చేసి ఆస్పటల్ మూసివేయాలని ఇప్పటికే హాస్పిటల్ లో ముగ్గురు మరణించారు అని తక్షణమే డాక్టర్ పై చర్య తీసుకొని ఆస్పటల్ మూసివేయాలని  కందుకూరు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ డిమాండ్ చేశారు. హాస్పటల్ మరొకరి ప్రాణాలు పోకుండా ఉండటానికి తక్షణమే హాస్పిటల్లో మూసివేయాలని  డిమాండ్ చేస్తున్నారు. అసలు వైద్య శాఖ హాస్పిటల్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని  ప్రశ్నించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments