పోడు భూముల సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి గిరిజన లు
భద్రాద్రి కొత్తగూడెం ప్రజా కలం ప్రతినిధి (మణుగూరు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం లోని పెద్ద తోగు , గ్రామానికి చెందిన స్థానిక గిరిజనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుని కలిసి స్థానికంగా ఉన్నా పోడు భూముల సాగు దారుణాల పై ఫారెస్టు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్థానిక గిరిజన మహిళలు, గ్రామాల ప్రతినిధులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా. కాంతారావుకి వినతిపత్రం అందజేయడం జరిగింది. కొంతమంది ఫారెస్టు అధికారులు గిరిజన లు అనీ కూడా చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక గిరిజన మహిళలు ఎమ్మెల్యే కు పిర్యాదు చేశారు .ఈ పోడు భూములు విషయంలో స్థానిక ఎమ్మెల్యే రేగా .కాంతారావు స్పందించి జిల్లా ఫారెస్ట్ అధికారులతో చరవాణిలో మాట్లాడి పొడుభూమి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ పోడు భూములు మా తాతలు, మా తండ్రులు ఏళ్ల తరబడి సాగు చేస్తున్నటువంటి భూములకు ఫారెస్టు అధికారులు అడ్డు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, నేలను సాగు చెయ్యకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు అందరూ కలిసి రేగా. కాంతారావుకి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఎమ్మెల్యే జిల్లా ఫారెస్ట్ అధికారులతో తక్షణమే మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన లు పాల్గొన్నారు.