సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలి………
మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించిన బంజార నాయకులు…………..
ప్రజాకలం-కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (ప్రజా కలం ప్రతినిధి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని బంజారా నాయకులు అన్నారు.ఈ మేరకు బంజారా ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికార పూర్వకముగా ఫిబ్రవరి 15వ తారీకు రోజున సెలవు ప్రకటించాలని మేడ్చల్ జిల్లా రూరల్ గిరిజన మోర్చా బిజెపి అధ్యక్షులు రామచంద్రనాయక్ ఆధ్వర్యంలో బంజారా ఆచార, వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయాలను గౌరవిస్తూ జిల్లాలోని అన్ని మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ లలో సంత్ సేవాలాల్ మహారాజ్ మరియు తుల్జా భవాని మీరమ్మ యాది ఆలయాలకు మరియు బంజారా కమ్యూనిటీ హాల్ కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని అంతేకాకుండా ఆలయ మరియు బంజారా కమ్యూనిటీ హాల్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.జిల్లాలోని వివిధ మండల మున్సిపల్ కార్పొరేషన్ లలో ఫిబ్రవరి 15వ తారీఖున సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున సెలవు ప్రకటించాలని కోరుతూ మండల తాసిల్దార్ కి వినతి పత్రం అందించాలని మేడ్చెల్ జిల్లా రూరల్ గిరిజన మోర్చా అధ్యక్షులు రాంచంద్ర నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సునీత నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్, ముఖ్య నాయకులు శంకర్ నాయక్, సునీతా బాయ్, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ నాయక్,అర్బన్ కార్యదర్శి గిరి సింగ్ నాయక్, కార్యదర్శి దేవి బాయి, బిజెపి సీనియర్ నాయకులు సుధాకర్ నాయక్,కార్యవర్గ సభ్యులు రాజు,
పోచారం మున్సిపాలిటీ గిరిజన మోర్చా అధ్యక్షుడు సురేష్ నాయక్, ఉపాధ్యక్షులు సీతారాం నాయక్, మరియు బంజారా నాయుకులు తదితరులు పాల్గొన్నారు.