తుక్కుగూడ గడ్డమీద రెపరెపలాడిన కాషాయం జెండా
ఎయిర్ పోర్ట్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ
ఎటు చూసినా కాషాయం జెండా భారీ హాజరైన కార్యకర్తలు
టిఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తుక్కుగూడ చైర్మన్ కు అడుగడుగున ప్రజల నీరాజనం
తుక్కుగుడ/మహేశ్వరం ఫిబ్రవరి 11 (ప్రజా కలం)
మహేశ్వరం మండల కేంద్రంలో తుక్కుగూడ మున్సిపల్ పరిధిలో బిజెపి పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది బీజేపీ నాయకులు ఆందోళన చేయకుండా శాంతియుతంగా పోలీసులు చెప్పిన విధంగా కొంతమంది మాత్రమే ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్లి తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధు మోహన్ బీజేపీలో చేరిన తర్వాత ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడనుండి బిజెపి కార్యకర్తలు నాయకులు అభిమానులు స్థానిక ప్రజల మధ్య కోలాహలంగా బైక్ కార్లు ర్యాలీతో అడుగడుగున కార్యకర్తల నీరాజనాల మధ్య ర్యాలీ కొనసాగింది ర్యాలీ వందల వేల మంది కార్యకర్తలను కొనసాగుతున్న ర్యాలీ ని చూస్తే ఎటు చూసినా బీజేపీ జెండాలతో రెపరెపలాడుతూ కనిపించాయి. అసలు ఎక్కడ ఉన్నాం అసలేమీ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వేల మంది కార్యకర్తలు స్థానిక ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది కానీ బిజెపి నాయకులు ఎలాంటి ఘర్షణ వాతావరణం కాకుండా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి విజయవంతం చేశారు. ర్యాలీలు నిర్వహిస్తూ తుక్కుగుడ మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ మధు మోహన్ అడుగు పెట్టారు. అక్కడి నుండి చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి కు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మధు మోహన్ మాట్లాడుతూ ఇప్పటివరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగింది ఇకనుండి ధర్మ పాలన కొనసాగుతుందని ప్రజలకు సంక్షేమ ప్రజా పాలన అందిస్తూ ధర్మా పాలన కొనసాగిస్తామని అన్నారు.తుక్కుగుడ బిజెపి మున్సిపల్ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్ బోధ యాదగిరి రెడ్డి తూర్పు అనిత జయరాజ్ ఎరుకల శివ కుమార్ గౌడ్ మౌనిక మహేందర్ కొప్పుల పద్మ శివయ్య బాకీ విలాస్ బరిగెల హేమలత రాజు గౌడ్ జాపాల భావనా సుధాకర్ రాజమోని రాజు బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు రాకేష్ గౌడ్ శ్రవణ్ కందుకూరు ఎంపీ మంద జ్యోతి పాండు రఘుమారెడ్డి రామకృష్ణ ఫిదా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.