Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌తెలంగాణా ప్రభుత్వం మొత్తం ఆ నలుగురి చేతిలోనే

తెలంగాణా ప్రభుత్వం మొత్తం ఆ నలుగురి చేతిలోనే

తెలంగాణా ప్రభుత్వం మొత్తం ఆ నలుగురి చేతిలోనే

టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చక నే బిజెపిలో చేరా

మీరు చేసే సౌండ్ కు మేము రీసౌండ్ ఇస్తాం

ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నాయకుల పై సోయి తప్పి మాట్లాడితే  టిఆర్ఎస్ పూసాలు కదిలిస్తాం

నేటితో టిఆర్ఎస్ అరాచక పాలన కు ముగింపు

ఇకనుండి బిజెపి ధర్మపాలన కొనసాగింపు

తుక్కుగుడ మున్సిపల్  చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌

తుక్కుగుడ/మహేశ్వరం ఫిబ్రవరి 11 (ప్రజా కలం)

టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు నచ్చక నే బిజెపిలో చేరడం జరిగిందని తుక్కుగుడ మున్సిపల్  చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌ అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ బిజెపిలో చేరిన సందర్భంగా ఢిల్లీ నుండి  మున్సిపల్ కేంద్రానికి ర్యాలీ గా తరలివచ్చారు. ఈ సందర్భంగా  మధు మోహన్ మాట్లాడుతూ
తుక్కుగుడ మున్సిపాలిటీలో సూపరిపాలనను అందిస్తామని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం మొత్తం ఆ నలుగురి చేతిలోనే ఉన్నదన్నారు.. టిఆర్ ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కానీ చేతల్లో ఏమి లేదని అన్నారు కెసిఆర్ ఉదయం ఒకమాట,సాయిత్రం అయితే మరో ఒకమాట మాట్లాడుతాడు మోడీ గురించి మాట్లాడే ఆర్హత లేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. నేను టి ఆర్ ఎస్ పార్టీలో చేరలేదు నా వలననే టి ఆర్ ఎస్ పార్టీ కి బలం వచ్చింది తుక్కుగూడలో ఎక్స్ అఫిషియో దొంగ ఓట్లతో  నన్ను కలుపుకొని తుక్కుగుడా లో టి ఆర్ ఎస్ పార్టీ  చైర్మన్ దక్కించుకున్నారు.
కానీ తుక్కుగుడా లో
టిఆర్ఎస్ పార్టీకి చోటులేదన్నారు. బీజేపీ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తుక్కుగుడా లో బీజేపీ పార్టీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ బిజెపి కి అన్యాయం చేసిందని ఈ రోజు అన్యాయంగా మారిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల లో ప్రభుత్వ అధికారులు  రిమోట్ మాదిరిగా పనులు చేయించుకుంటున్నారని మున్సిపల్ చైర్మన్ లు నామ మాత్రపు బొమ్మ మాదిరిగా తయారైందని కేవలం స్టీరింగ్ మాత్రమే మున్సిపల్ చైర్మన్ చేతిలో రిమోట్ మాత్రం మంత్రుల చేతిలో ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకే ఈ అరాచక పాలన నేటితో అంతమవుతుందని రేపటి నుండి బీజేపీ ధర్మ పాలన ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సంక్షేమ పాలన అందిస్తామన్నారు.
తుక్కుగుడ బిజెపి మున్సిపల్ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్   బోధ యాదగిరి రెడ్డి తూర్పు అనిత జయరాజ్ ఎరుకల శివ కుమార్ గౌడ్  మౌనిక మహేందర్  కొప్పుల పద్మ శివయ్య  బాకీ విలాస్ బరిగెల హేమలత రాజు గౌడ్  జాపాల భావనా సుధాకర్  రాజమోని రాజు  బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు  రాకేష్ గౌడ్   శ్రవణ్  కందుకూరు ఎంపీ మంద జ్యోతి పాండు   రఘుమారెడ్డి  రామకృష్ణ  ఫిదా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments