దళిత బంధు దగాకు 100 రోజులు
– వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిర్రు రాజు
ఫిబ్రవరి 11 వర్ధన్నపేట:-
(ప్రజాకలం ప్రతినిధి)
రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి దళిత బందు అమలు చేయాలని వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బిర్రు రాజు శుక్రవారం వర్ధన్నపేట తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిర్రు రాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి పిలుపు మేరకు మరియు వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె శ్రీ రంగనాథ్ ఆదేశాల మేరకు మరియు వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్ము రమేష్ వర్ధన్నపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బిర్రు రాజు ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం తహశీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబందు పధకం కింద తెలంగాణ దళితులందరికి 10 లక్షల రూపాయలిస్తానని ప్రకటించి నేటికి 100 రోజులు పూర్తి అవుతుంది కాని వర్థనపేట నియెజికవర్గం లో ఇంత వరకు ఒక్క దళిత కుటుంబంలో ఈ పథకం అమలు కాలేదు. ఈ యొక్క పథకం ప్రతి దళిత కుటుంబంనికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కొండేటి బాలకృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకులు కొండేటి అఖిల్ శ్రీకర్ సతీష్ నాగరాజ్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు