ఆసరా పై స్పందించిన అధికారులు
– ప్రజాకలం కథనానికి విశేష స్పందన
– హర్షం వ్యక్తం చేస్తు, ప్రజాకలం పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ఆసరా లబ్దిదారులు
– నిరంతరం ప్రజల కోసం ప్రజాకలం పత్రిక
యాచారం, ఫిబ్రవరి 11, (ప్రజాకలం ప్రతినిధి): ఆసరా పై స్పందించిన ప్రభుత్వ అధికారులు. ప్రజాకలం పత్రికలో శుక్రవారం వచ్చిన “ఆసరా కోసం ఎదురుచూపులు” అనే కథనానికి విశేష స్పందన లభించింది. శుక్రవారం గ్రామాలలో తపాలా శాఖ అధికారులు ఆసరా లబ్దిదారులకు పింఛన్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆసరా పింఛన్ల లబ్దిదారులు మాట్లాడుతూ.. ప్రతి నెల మొదటి వారంలో ఆసరా పింఛన్లు పంపిణి చేయాలని కోరారు. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న నూతన పింఛన్లు మంజూరు చేసి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మా సమస్యలను ప్రభుత్వం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా జర్నలిస్ట్ మల్కాపురం శివశంకర్ ను పలువురు వికలాంగుల సంఘాల నాయకులు చరవణి ద్వారా అధినందిస్తు కృతజ్ఞతలు తెలిపారు.