Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్గ్రామాల్లో మద్యం మస్త్.. రోడ్లపై ప్రమాదాలు మస్త్..

గ్రామాల్లో మద్యం మస్త్.. రోడ్లపై ప్రమాదాలు మస్త్..

గ్రామాల్లో మద్యం మస్త్.. రోడ్లపై ప్రమాదాలు మస్త్..
● మద్యానికి బానిస అవుతున్న యువత
● రోడ్లపై పడుతున్న నిరుపేద కుటుంబాలు
● రోడ్డు ప్రమాదాలకు మద్యం కారణం
● మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు
● ఆటోలలో గ్రామాలకు మద్యం సరఫరా
యాచారం, ఫిబ్రవరి 16, (ప్రజాకలం ప్రతినిధి): యాచారం మండలంలోని గ్రామాల్లో మద్యం బెల్టుషాపులు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. యాచారం మండలంలోని 24 గ్రామలలో సుమారు 250కి పైగా బెల్టుషాపులు నడుస్తున్నాయని అంచనా. పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా బెల్టు షాపులు స్థానికంగా షాపుల్లో కొనుగోలు చేసిన మద్యాన్ని అధిక ధరలకు అమ్మి కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. ఇళ్ల మధ్యలో పలువురు ఇళ్లలోనే మద్యం బాటిళ్లు దాచి అవసరమైన వారికి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇళ్ళ నుంచి గుట్టుచప్పుడు కాకుండా రోడ్డు మార్గాన కాకుండా డొంకరోడ్లలో మద్యం తీసుకొస్తున్నారు. అధిక రేట్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న మద్యం షాపుల్లో కూడా షాపులో పనిచేసే సిబ్బంది చేతివాటానికి అలవాటు పడినట్లుగా సమాచారం. బెల్టుషాపుల నిర్వాహకులకు ఎక్కువ మొత్తంలో మద్యం అందజేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. యువకులు ఖాళీగా ఉండటం వల్ల బెల్ట్‌షాపుల నిర్వాహకులే మద్యం సేవించే వారికి ఫోన్‌ చేసి తమ వద్ద మందు(మద్యం) అందుబాటులో ఉందని చెప్పి ఎక్కడ ఉన్నారో చెబితే అక్కడికి తీసుకొచ్చి ఇస్తామని చెబుతున్నారు. అవసరమైన వారికి ద్విచక్ర వాహనాలు లేదా సైకిల్‌ ద్వారా తీసుకెళ్లి మద్యం అందజేస్తున్నారు.రోడ్డ సమయంలో ఇళ్ళ ముందు మద్య ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా ఆ షాపులో ఉంచి మద్యం సేవించే వారికి అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా తీసి ఇస్తున్నారు. రాత్రి పది గంటల వరకు గ్రామాల్లో పలు ప్రాంతాల్లో ఆయా వీధుల్లో ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

మద్యానికి బానిస అవుతున్న యువత

యువత మద్యానికి బానిసై చెడుఅలవాట్లకు పాల్పడుతున్నారు. అతి చిన్న వయసులోనే మద్యం సేవిస్తూ నిరుపేద కుటుంబాలకు భారం అవుతున్నారు.కొన్ని కుటుంబాలు తినడానికి తిండి గింజకూ కరువు పరిస్థితులు ఉన్న, మద్యం జీవించడానికి మాత్రం వెనుకకు తగ్గడం లేదు.

రోడ్డు ప్రమాదాలకు మద్యమే కారణం

యాచారం మండలంలోని మాల్ నుండి యాచారం మీదగా ఇబ్రహీంపట్నం, యాచారం కందుకూరు వైపు వెళ్లే రహదారిలో రోజురోజుకు ఎక్కడో ఒక చోట రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి.మద్యం సేవించి అతి వేగంగా, తప్పుదారిలో వెళ్లాడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆటోలలో గ్రామాలకు మద్యం సరఫరా

యాచారం మండల కేంద్రంతో పాటు మాల్, గునుగల్, చుట్టు పక్కల ఉన్న వైన్స్ ల నుండి గ్రామాలకు రాకపోకలు సాగించే ఆటోలలో మద్యం బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు. యాచారం మండల కేంద్రం నుండి మాల్, యాచారం నుండి కుర్మిద్ద, యాచారం నుండి కందుకూరు గ్రామాలకు వెళ్లే ప్రయివేట్ ఆటోలలో మద్యాన్ని సరఫరా చేస్తున్నారు.

గ్రామాల్లో పెరుగుతున్న బెల్టుషాపులు

యాచారం మండల పరిధిలోని కుర్మిద్దలో రోజురోజుకు బెల్టుషాపులు పెరుగుతున్నాయి. అతిచిన్న వయసులోనే యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది. గ్రామంలో నడిచే ప్రయివేట్ ఆటోల ద్వారా వైన్స్ ల నుండి మద్యాన్ని బెల్టుషాపులకు చేరుస్తున్నారు. కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో బెల్టుషాపులు నడవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments