Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్న మహిళా శక్తి

అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్న మహిళా శక్తి

అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్న మహిళా శక్తి

జిల్లాలో అన్నింటా రాణిస్తున్న అతివలు

-*రాజకీయాల్లో రాణిస్తూ..ప్రగతి సాధిస్తూ

-*వంటింటి నుంచి వ్యాపారం దాకా

-*ఉన్నత స్థాయి ఉద్యోగాల్లోనూ మహిళలే.

-*నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పెద్దపల్లి,మార్చి 07:(ప్రజాకం ప్రతినిధి)
అతివ పురోగమిస్తోంది.అద్భుత విజయాలను సాధిస్తోంది.అత్యున్నత శిఖరాలను చేరుకుం టోంది.విద్య,ఉద్యోగ,సామాజిక,ఆర్థికంగా,రాజకీయం రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం ఇతోధికంగా పెరుగుతోంది.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్దపల్లి జిల్లాలో మహిళలకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలను అందుబాటులోకి వస్తున్నాయి.షాపింగ్‌మాల్స్,సూపర్‌మార్కెట్లు,చిరు వ్యాపార సంస్థలు,ఆస్పత్రులు,విద్యాసంస్థలు,రెస్టారెంట్లు,
పెట్రోల్‌ బంకులు,తదితర అన్ని చోట్ల మహిళల శ్రమ,ప్రతిభ ఉంది.ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఇంటిని చక్కది ద్దుకుంటూనే వ్యాపారం,ఉద్యోగం,రాజకీయంగా వారు బాద్యతలు నిర్వహిస్తూ అగ్రభాగాన నిలుస్తున్నారు.రంగం ఏది అయితేనేమి అన్నింటా తనదైన ముద్ర వేసుకుంటూ ఎంత ఎదిగినా ఇల్లాలి బాధ్యతలను,మధురిమలు పంచే అమ్మతనాన్ని దూరం చేసుకోవడం లేదు.ఆధునికతను,సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతోంది నేటి మహిళ..నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని

‘ప్రజాకలం’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
[5:52 PM, 3/7/2022] +91 98490 07793: రాజకీయాల్లోనూ మహిళా రాణులు
ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు.పొలిటికల్‌లో కీలకమైన పదవుల ను అలంకరిస్తూ శాసిస్తున్నారు.రాజకీయాల్లో నూ ప్రభుత్వాలు మహిళలకు 50 శాతం పైగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి.అదేవిధంగా పొలిటి కల్‌ పార్టీలు సైతం పురుషులతో సైతం మహిళలకు స్థానం కల్పిస్తూ రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే పైచేయి అవుతోంది.మున్సిపాలిటీ పాలకవర్గాలలోనే సగానికిపైగా వారే ప్రజాప్రతి నిధులుగా ఉన్నారు.ఇలా ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో రాజకీయాల్లోనూ మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు.రాజకీయంగా ప్రభుత్వాలు మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను అంది పుచ్చుకుంటూ ప్రజాసేవలో ముందుకు పోతున్నారు.డాక్షర్ వృత్తిలో ఉంటూ అందివచ్చి న అవకాశాన్ని వినియోగించుకున్న డాక్టర్ దాసరి మమత రెడ్డి పెద్దపల్లి పట్టణ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గా,మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పుట్ట శైలజ కొనసాగుతున్నారు.పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా నాజ్మీన్ సుల్తాన్, పెద్దపల్లి ఎంపీపీగా బండారి స్రవంతి,జడ్పీ వైస్ చైర్మన్ గా మండిక రేణుక,పాలకుర్తి జడ్పీటీసీగా కందుల సంధ్య రాణి,రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క గౌడ్,ఇలా వీరే కాకుండా సర్పంచ్‌ లు, ఎంపీపీలు,ఎంపీటీసీలు,జడ్పీటీసీలు ఈ పదవుల్లోనూ చాలా మంది మహిళలు ఉన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లోని కీలకమైన పోస్టుల్లోనూ మహిళలు

జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో ని కీలకమైన శాఖలకు అధిపతులుగా మహిళలు రాణిస్తున్నారు.జిల్లా కలెక్టర్ గా సంగీత సత్యనారాయణ,జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, డివిజనల్ పంచాయతి అధికారి దేవికి దేవి,ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రాజేశ్వరి, ఐసీడిఎస్ సిడీపీఓ రజిత, కలెక్టరేట్ సూపరిండెంట్ గా అనుపమ రావు, కాల్వశ్రీరాంపూర్ ఎమ్మార్వో సునిత,రామగిరి ఎమ్మార్వోగా పుష్పలత,పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిగా అలివేణి,పెద్దపల్లి మహిళా ఎస్సై గా మౌనిక పటేల్ ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు.
[5:52 PM, 3/7/2022] +91 98490 07793: విద్యతోనే సామాజిక ఎదుగుదల

వ్యక్తిగతమైన స్వేచ్ఛ,సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందటానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు,లోక జ్ఞానాన్ని విద్య అందిస్తుంది.స్త్రీకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది.సమాజంలో అభివృద్ధి సాధించాలంటే తల్లి తండ్రులు చిన్ననాటి నుండే మగవారి సమానంగా ఇతర రంగాల్లో వారిని ప్రొత్సహిస్తూ స్త్రీకి విద్య తప్పకుండా అందించాలి.అప్పుడే సమాజంలో ఎదుగుదల అనేది ఏర్పడు తుంది.సమాజ సేవ చేయాలనే వైద్యవృత్తి చేపట్టాను..ప్రజలకు మరింత చేరువై సేవలందించేందుకే రాజకీయాల్లోకి వచ్చాను.మహిళలకు ప్రభుత్వం కల్పించి అవకాశాన్ని వినియోగించుకొని మున్సిపల్ చైర్ పర్సన్ గా అధికారం పోందాను.మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న వారి హక్కులను వినయోగించుకొని ముందుకు సాగాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments