అసెంబ్లీ స్పీకర్ వైఖరిని నిరసిస్తూ బోడుప్పల్ డా”అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మౌన ప్రదర్శన
మేడిపల్లి (ప్రజా కలం) :- బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తాలో అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష చేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని మౌనదీక్షలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ,ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరు తెరవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను హరించి, శాసన సభ్యుల హక్కులను కాలరాసిన అసెంబ్లీ స్పీకర్ వైఖరికి నిరసనగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం కూడా లేకుండా చేసి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసారని రానున్న రోజులలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడం ఏమిటని నిరసన తెలిపిన శాసనసభ్యుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో,మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లీగల్ సెల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ బి- బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ ,బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కొత్త దుర్గమ్మ ,తోటకూర అజయ్ యాదవ్ , బొమ్మక్ కళ్యాణ్ ,పి.శోభారాణి వెంకటేష్ గుప్తా,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారు ,కొత్త ప్రభాకర్ గౌడ్ ,బాలరాజ్ గౌడ్ , హరినాథ్ రెడ్డి ,తోటకూర మల్లేష్ యాదవ్ ,రాపోలు శంకరయ్య ,రాపోలు ఉపేందర్ , జ్ఞానేశ్వర్, విశ్వం గుప్త, ప్రశాంత్, బీరప్ప,రంజిత్ రెడ్డి,రాపోలు రామస్వామి, ఏ రాములు,చంటి ,వినోద్,మహేష్ యాదవ్,విజయ్,అరవింద్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు