ఐ సి డి ఎస్ నర్సంపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మార్చి 8 (ప్రజా కలం ప్రతినిధి) నర్సంపేట
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మహిళా దినోత్సవ వేడుకలను నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి , జిల్లా పరిషత్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న గార్లు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్న సందర్భంగా ఈ రోజే మహిళా దినోత్సవం జరుగుతుందని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత ప్రభుత్వం ఉందని ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే వంట ఇంట్లో ఉన్న మహిళ రోడ్డుమీదికి వచ్చినప్పుడే ఆ దేశం అత్యున్నత స్థాయికి పోతుందని అందుకు మహిళలు ,పురుషులతో సమానంగా పనిలో పోటీ పడుతున్నారని విద్యారంగంలో పోటీ పరీక్షల్లో చూసుకున్నా విద్యార్థునులదే పై చేయి ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ స్వప్న సుదర్శన్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ చే అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి,దార్ల రమాదేవి, గుడిపూడి అరుణ ,జడ్పీటీసీ లు, ఏం పి లు, ఎం పి టి సి లను, మున్సిపల్ కౌన్సిలర్ లను, ఐ సి డి ఎస్, ఏ సి డి పి ఓ విద్య, సూపర్వైజర్లు, అంగన్ వాడి ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు గొర్రె రాధ,బత్తిని శిరీష నర్సంపేట మున్సిపాలిటీ మహిళా కార్మికులకు సన్మానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని కిషన్ , ఎ సి డి పిఒ విద్య సూపర్వైజర్లు ,మంజుల ,శ్యామల, రాధ ,వాసంతి ,రమా, టి ఆర్ ఎస్ కె వి జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, టి ఆర్ ఎస్ కె వి నాయకులు పాలడుగు రమేష్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.