Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

-కోటి 28 లక్షల 14 వేల విలువైన 128 చెక్కుల అందజేసిన ఎమ్మేల్యే పెద్ది

-లబ్ధిదారుల కళ్ళలో ఆనంద బాష్పాలు

మార్చి 8(ప్రజా కలం ప్రతినిధి) నర్సంపేట
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మహిళ ముర్తులందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నర్సంపేట నియోజకవర్గానికి చెందిన 128 మంది (SC & ST) మహిళలకు రూ. కోటి 28 లక్షల, 14 వేల విలువైన కళ్యాణలక్ష్మి చెక్కులను నేడు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సంపేట నియోజకవర్గంలో ఐ కె పీ & మెప్మా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా క్రీడోత్సవాలలో భాగంగా తొమ్మిది రకాల క్రీడలను మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు కేబినెట్ మంత్రులతో కలిసి ప్రారంభించము అన్నారు.ఈ క్రీడలు మూడు రోజుల నుండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గౌరవ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు “మహిళా సంబురాల” కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అంటూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి మహిళలకు సంబంధించి అనేక పథకాలు వారి సాధికారత కోసం కృషి చేస్తూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది.ఈ విధంగా స్త్రీ శక్తిని ప్రోత్సహిస్తున్న మన కేసీఆర్ గారి చిత్రపటానికి నియోజకవర్గ మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మహిళలకు ప్రత్యేక రక్షణతో పాటు హక్కులను, గౌరవాన్ని పొందినప్పుడే సమాసమాజం అభివృద్ధి చెందుతుంది.వీటన్నింటినీ ఆలోచించి హక్కులో భాగంగా ప్రత్యేక దినం ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వాలు నిర్ణయించి మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయడమైనది.మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అన్ని ఉద్యోగాలకు కల్పించారు.కళ్యాణలక్ష్మి పథకంలో పెళ్లి కూతురు తల్లినే లబ్ధిదారున్నీ చేసి తల్లి పేరుపైన చెక్ వచ్చే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఆచరణ చేసింది.మునుపెన్నడూ లేని విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మహిళా క్రీడోత్సవాలలో 6000 మంది పైచిలుకు మహిళలు ఆరు మండలాల్లో కలిపి పాల్గొనడం జరిగింది.ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా తమ పాత్రలను చాలా అద్భుతంగా పోషిస్తున్నారు.ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా ముందుకు పోవాలి అంటే కచ్చితంగా మహిళలను ప్రోత్సహించాలి.ఈ క్రీడల్లో భాగంగా మండల స్థాయిలో గెలిచిన ప్రతి టీoని నియోజకవర్గ స్థాయి ఫైనల్లో ఆడించడం జరుగుతుంది.
మహిళా దినోత్సవ ముగింపు వేడుకలు ఈ నెల చివరి అంకంలో చాలా గొప్పగా నర్సంపేటలో నిర్వహించి మహిళల దీవెనలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.ఇంతమంచి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.కాబట్టి ఈ నగదును వృధా చేయకుండా పెళ్లికోసం చేసే అప్పును తీర్చడానికి ఉపయోగించుకునేలా జాగ్రత్తపడాలని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అన్నాడు. అనంతరం నియోజకవర్గ మహిళలతో కలిసి నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.కార్యక్రమంలో ఒడిసీఎంఎస్ చైర్మన్, జెడ్పి ఫ్లోర్ లీడర్, నర్సంపేట ఆర్డీవో, మున్సిపల్ చైర్ పర్సన్, తహశీల్దార్లు, జెడ్పి కోఆప్షన్ సభ్యులు, ఎంపిడివోలు, ఎంపిపి, జెడ్పిటిసిలు, వైస్ ఎంపిపి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments