నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేసిన కాంగ్రెస్ నాయకులు…
చెన్నారావుపేట( ప్రజా కలం) ప్రతినిధి
శాసనసభ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కని అవమాన పరిచే విదంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరి ని నిరసిస్తూ,ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అదేశాల మేరకు చెన్నారావూ పేట మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్ల పెల్లి నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యాక్రమం,నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్ మాట్లాడుతూ. రాష్ట్ర సీనియర్ సి ఎల్ పి నాయకుడు బట్టివిక్రమార్కని అవమానించడం దురదృష్టకరం అనీ.రాజ్యాంగ బద్ధ మైన స్పీకర్ హోదాలో వుండి సాటి ఎమ్మెల్యే ని అవమానించడం సిగ్గు చేటని ఆయన అన్నారు.అదేవిధంగా శాసనసభ సమావేశాల్లో రాజ్యాంగాన్ని ఉల్లంగంచి గవర్నర్ ప్రసంగం లేకుండా నిర్వహించి రాజ్యాంగ నిపుణుడు అంబేద్కర్ ని అవమాన పరిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిజాముల పరిపాలన చేస్తున్నాడని. త్వరలోనే కేసీఆర్ కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్,మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్,సర్పంచులు సిద్దన రమేష్,శ్రీధర్ రెడ్డి,భద్రు నాయక్,తూటి పావని రమేష్,ఎంపీటీసీ రమ బాయి మీభూసింగ్ రాథోడ్,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బండి హరీష్,యువజన కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ నాయక్,అక్కల్ చెడ ఉప సర్పంచ్ బాణోత్ వీరన్న నాయక్,ఉప్పర పెల్లి ఉప సర్పంచ్ కాసాని రమేష్,నాయకులు బాబురావు,బొంత సారయ్య,మల్లా రెడ్డి,కంది మహేందర్ రెడ్డి,లక్క కుమారస్వామి,హంస వీరస్వామి,వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు రాజశేఖర్,నర్సు నాయక్,రాందాస్,హనుమ నాయక్,బాస్కర్ నాయక్, మహేందర్ రెడ్డి, అశోక్ ,అమీనాబాద్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు మేడి సతిష్,యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు లక్క రాజు,పింగిలి అశోక్ రెడ్డి,లక్క విజయ్,సుమన్ నాయక్,భద్రు నాయక్, సేవ్య నాయక్,స్వామి, వార్డు సభ్యులు బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు…