Saturday, May 21, 2022
Google search engine
Homeజాతీయ౦స్వావలంబన ధ్యేయంగా ముందుకు సాగండి

స్వావలంబన ధ్యేయంగా ముందుకు సాగండి

స్వావలంబన ధ్యేయంగా ముందుకు సాగండి

చదువు, కెరీర్ పై శ్రద్ద పెట్టండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితి పిలుపు

మార్చి 8,ప్రజా కలం ప్రతినిధి,
సంపూర్ణ స్వావలంబన ధ్యేయంగా ముందుకు సాగాలని, అనుకున్న రంగాలలో అగ్రభాగాన నిలిచినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సాహితి పిలుపు ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కించుకుని కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రత్వ శాఖ పరిధిలోని ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో మంగళవారం భువనగిరి పట్టణం లోని స్టాన్ ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రత్యేక సదస్సు నిర్వహించింది. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి జి. కోటేశ్వర్ రావు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సాహితి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలని, అప్పుడే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నారు. విద్యార్థినులు చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టాలని కోరారు. సామాజిక మాధ్యమాల పట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు. నేటి ఆధునిక కాలంలో సత్తా, అర్హత ఉంటే అవకాశాలకు కొదవ లేదని, మహిళలు వాటిని అందుకోవడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం గౌరవ అతిథులు గా హాజరైన సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సౌజన్య, డాక్టర్ కావ్య తదితరులు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పౌష్ఠికాహారంతోనే జబ్బులకు దూరంగా ఉండొచ్చు అని సూచించారు. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ మహిళా కళాశాల విద్యార్థినులకు మహిళా సాధికారత అనే అంశంపై వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల విజేతలకు సదస్సులో ముఖ్య అతిథులు మెరిట్ సర్టిఫికేట్, ప్రైజ్ లు అందచేసి అభినందించారు. డిగ్రీ విద్యార్థినులు తో పాటు ఈ కార్యక్రమానికి వారి తల్లులు ప్రత్యేక ఆహ్వానితులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలు వారి తల్లులను ప్రత్యేకంగా సత్కరించి గౌరవించారు. మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు తో పాటు, వారి తల్లులకు కలశాల ఆవరణలో మురుగన్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు తల్లులకు, విద్యార్థులకు పరీక్షలు నివ్లర్వహించి, ఉచితంగా మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments