టిఆర్ఎస్ సంబరాలతో దద్దరిల్లిన యాచారం
యాచారం, మార్చి 9, (ప్రజాకలం ప్రతినిధి): తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన సందర్బంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా జరిగాయి. యాచారం మండల కేంద్రానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాచారం మండల యువతతో పాటు బంటి యూత్ ఫోర్స్ సభ్యులు స్వీట్లు పంచుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, రెండో దఫాగా 91,142 ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ప్రకటన యావత్ తెలంగాణ నిరుద్యోగ యువకులకు సంతోషకరమైన వార్త అని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా నియమించిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రాజునాయక్, జెర్కొనీ రాజు, కాజు మహ్మద్, సహకార సంఘం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, జాని బాయ్, తలారి మల్లేష్, సంపత్ కుమార్, మండలి గోపాల్, బోల్లంపళ్లి వెంకటేశ్, కల్లూరి శివకుమార్, భాస్కర్, గణేష్ నాయక్, శివశంకర్, అజ్మత్, పెద్ది వెంకటేశ్, శ్రీకాంత్, శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.