Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedప్రమాదానికి నిలయంగా విద్యుత్ వైర్లు

ప్రమాదానికి నిలయంగా విద్యుత్ వైర్లు

ప్రమాదానికి నిలయంగా విద్యుత్ వైర్లు

పలుమార్లు అధికారులకు  చెప్పినా పట్టించుకోని వైనం

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

మహేశ్వరం మర్చి 09 (ప్రజా కలం)

మహేశ్వరం మండల కేంద్రం కల్వకోల్ గ్రామంలో విద్యుత్ వైర్లు వరి పొలాలకు తాగే విదంగా ఉన్నాయని వాటిని సరిచేయాలని ఎన్ని సార్లు చెప్పినాగాని సంబంధిత విద్యుత్ అధికారులు
పట్టించుకోవడం లేదని రైతు మధుసూదన రెడ్డి ఆరోపిస్తున్నారు. గత
సంవత్సర కాలం నుండి అధికారులకు చెప్పిన గాని కాలక్షేపం
చేస్తూ రోజులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎపుడు ఏక్షణాన ఏమి జరుగుతుందో తెలియని
పరిస్థితులు ఉన్నాయని అన్నారు. చిన్న పిల్లలకు చేతులకు
అందేంత ఎత్తులో ఉండడంతో అక్కడ వ్యవసాయం చేసుకునే
రైతులు భయపడుకుంటు రోజులను లెక్కపెడుతున్నారని ఆయన
అన్నారు. తొందరలోనే సంబంధిత అధికారులు కరెంటు వైర్లను
సరిచేయక పోతే బారీ మూల్యం చెల్లించక తప్పదని ఆయన
ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments