పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కృషి…
– మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ
మెట్ పల్లి,మార్చి 19(ప్రజాకలం ప్రతినిధి) :
టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తోందని మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అన్నారు. శనివారం మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయించి పరీక్షలు చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికునికి బూస్టర్ డోస్ వేయించడం జరిగిందన్నారు. షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, క్షయ వ్యాధి టెస్ట్, బ్లడ్ టెస్ట్ లను పారిశుద్ధ్య కార్మికులకు చేయించడం జరిగిందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యం కొరకు ప్రతి నెల ఆరోగ్య వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు స్పందన, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, సానిటేషన్ ఇంచార్జి ముజీబ్, ధర్మేందర్, నిజాం, హెల్త్ సూపర్వైజర్ జగన్నాథం, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.