*పోలీస్ ఉచిత శిక్షణ స్క్రినింగ్ టెస్ట్ కి విశేష స్పందన.*

*వివిధ ప్రాంతాల నుండి సుమారు 1000 మంది నిరుద్యోగ అభ్యర్థుల రాక.*
జగిత్యాల ప్రతినిధి, మార్చి21,(ప్రజాకలం)
జీవితంలో ఏదైనా సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం గల యువత ఖచ్చితంగా రాణిస్తారని,పట్టుదలతో కష్టపడి చదివితే రాబోవు పోలీస్ ఉద్యోగాల్లో విజయం సాధించడం చాలా తేలిక అని జిల్లా అదనపు ఎస్పీ రూపేష్ ఐపీఎస్ అన్నారు.జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాలమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల లో త్వరలో రానున్న పోలీస్ రిక్రూట్మెంట్ (కానిస్టేబుల్, ఎస్సై) కొరకు పోలీసు ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్న నిరుద్యోగ యువతి యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పోలీస్ ఉచిత శిక్షణ కి సంబదించిన స్క్రినింగ్ టెస్ట్ ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతు విద్యార్హత మరియు టాలెంట్ ఉండి ఆర్థిక పరిస్థితులు సరిగా లేని వారు, హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణాలకు కోచింగ్ వెళ్లలేని వారి కోసం జిల్లా పోలీస్ శాఖ నిర్వహించే ఉచిత శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోలీస్ ఉచిత శిక్షణ కు ఆన్లైన్ లో లేదా సంబదిత పోలీస్ స్టేషన్ లలో సుమారు 1682 మంది అప్ప్లేయ్ చేసుకోవడం జరిందని ఇందులో స్క్రినింగ్ టెస్ట్ కొరకు సుమారు1000 మOది అభ్యర్థులు హాజరుకావడం జరిగింది ఇందులో సుమారుగా 262 మOది మహిళా అభ్యర్థులు రావడం జరిగింది .ఈ యొక్కస్క్రినింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మెట్పల్లి మరియు జగిత్యాల పట్టణాల్లో ఇండోర్ మరియు ఔట్ డోర్ కి సంబంధించి నిపుణులు అయిన వారి చే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. యువతీ,యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు. చదువు, ఉద్యోగానికి పేదరికం అడ్డురాదని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు పేదరికాన్ని జయించిన వారే అన్నారు. రాబోయే రోజుల్లో పోలీస్ ఉద్యోగాలతో పాటు వివిధ శాఖల్లో కూడా చాలా ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ రావడం జరుగుతుందని కావున నిరుద్యోగ యువతీ, యువకులు అందరూ కష్టపడి ఈ యొక్క నోటిఫికేషన్ కాలం ని వృధా చేయకుండా కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు అన్నారు.ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఏ ఉద్యోగం చేయాలని ఎవరు నమ్మాలో తెలియక చాలామంది మోసపోతుంటారు అని ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని అలా ఎవరైన ఉద్యోగాలు ఇస్తామని చెపితే స్థానిక పోలీస్ వారికీ సమాచరం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాష్,రవీందర్ రెడ్డి, సి.ఐ లు కిషోర్,కృష్ణకుమార్, ఆర్ ఐ లు నవీన్, వామనమూర్తి, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.