Saturday, May 21, 2022
Google search engine
Homeఆ౦ద్రప్రదేశ్అంతరించిపోతున్న జానపద కళలు

అంతరించిపోతున్న జానపద కళలు

అంతరించిపోతున్న జానపద కళలు
– ఆచరిస్తున్న ఉషన్నపల్లి గ్రామస్తులు
చిరుతలు రామాయణ కథల బృందానికి పలువురు ప్రజా ప్రతినిధులు ఆర్థిక సహాయం
ఆకట్టుకుంటున్న నృత్య ప్రదర్శనలు తిలకిస్తున్న ప్రజలు
కాల్వ శ్రీరాంపూర్, ఏప్రిల్ 15(ప్రజా కలం ప్రతినిధి)
మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలోని ఉషన్న పల్లి గ్రామంలో అంతరించిపోతున్న జానపద కథలను, పురాణ కథలను ఆచరిస్తూ,ప్రతి ఒక్కరు పట్టుదలతో గత కొద్ది రోజుల నుండి గురువుల వద్ద నాట్య ప్రదర్శన నేర్చుకొని, గత గురువారం నుండి శ్రీరామునిగా అనుముల రాజు రెడ్డి,లక్ష్మణ్నిగా ముస్కు సతీష్,సీతగా ముస్కు అనంతరెడ్డి, ఆంజనేయుని గా పాత్రికేయడు బాల శివ ప్రసాద్, రావణబ్రహ్మగా పెంతల మల్లారెడ్డి, సరళగా జునుమల శ్రీధర్, దశరధుని గా మంద మల్లారెడ్డి, గుహుడు గా అనుమల చంద్రయ్య, తదితరులు పాత్రలకు అనుగుణంగా వేషధారణ ధరించి ప్రజలు,అందరూ మూకుమ్మడిగా ఏర్పడి చిరుతల రామాయణం జానపద కథను,ప్రజలను కనువిందు చేస్తు ఆకర్షిస్తూ నాట్య ప్రదర్శిస్తున్నారు.

కనుమరుగవుతున్న భాగవత పురాణాలు

ఒకప్పటి పురాణ కథలు, ఆధార కరువవుతున్న జానపద కథలు నాట్యాలు, గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించే వారి జీవన శైలి, కలను నమ్ముకొని బ్రతికే వారు,సొంత గ్రామం ను వదిలి,హరి కథలు,గౌడ శెట్టి కథలు, బుర్ర కథలు,వారి వారి కులాలకు అనుకూలంగా గ్రామాలు పర్యటిస్తూ,పలు దేవతామూర్తుల కథల రూపంలో,వీధి నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు, ఆ నాటక ప్రదర్శనలో గ్రామస్తులు,మహిళలు, చిన్నలు పెద్దలు,నాటక ప్రదర్శన చేరుకొని,ఆ కథలను శ్రద్ధతో విని, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అప్పుడు మహిళలు జానపద పాటలను పాడుతూ, పని కష్టాల్లో తెలియకుండా, పాటలో నిమగ్నం అయ్యేవారు. అటువంటి కథల కలలను ఇప్పుడు కనుమరుగవుతూ, జాడ లేకుండా పోయాయి. ఆ కథలు విన్న పెద్దలు,చిన్నలు పెద్దలు మాట్లాడుకునేటప్పుడు ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు ఇస్తూ గౌరవంగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ మర్యాదలు కరువై పోయాయి, ఇప్పుడు యువత ఎక్కువ సేపు సమయం కేటాయిస్తూ, టీవీలు,మొబైల్ వాడకంతో, అందులో వీక్షించిన వికృత మాటలు, వికృతచేష్టలు వల్ల పిల్లలతో పెద్దలు మాట్లాడాలంటే, ఏమి అంటాడని భయపడుతూ మాట్లాడుతున్నారు.

గురువర్యులు ఆనంద గిరి

తాతల,ముత్తాతల, నేర్పించిన కథలను ఆచరిస్తూ,జానపద కథనం ప్రదర్శిస్తూ నేర్పిస్తూ, కుటుంబాలు వెళ్లదీసే వారివి, కానీ ఇప్పుడు టీవీలు మొబైల్ వల్ల,మా కథలకు ఆదరణ కరువై, కనుమరుగవుతున్నాయి, కుటుంబ పోషణ ఇబ్బంది దృష్టా,కూలి పనులకు వెళుతూ జీవనశైలి వెళ్లదీస్తున్నారు అని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments