Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా ఆరూరి ఘట్టమల్లు ఫౌండేషన్

నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా ఆరూరి ఘట్టమల్లు ఫౌండేషన్

నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా ఆరూరి ఘట్టమల్లు ఫౌండేషన్
– దాదాపు 50 లక్షల వ్యయంతో నియోజకవర్గ యువతకు శిక్షణ తరగతులు
భోజనవసతి, ఉచిత మెటీరియల్ అందిస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఏజిఎఫ్
క్రమశిక్షణ, నిబద్ధతతో చదవాలి వర్ధన్నపేటఎమ్మెల్యే అరూరి.
– ఏకగ్రతతో చదివినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం కలెక్టర్ గోపి
– అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి.
– అధిక సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు

ఏప్రిల్ 15 మమునూరు/ వరంగల్:-
(ప్రజాకలం ప్రతినిధి)

రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు మామునూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (PTC) లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ, ఉద్యోగ సాధనలో ఉన్న నిరుద్యోగులు క్రమశిక్షణ, నిబద్దతతో చదివితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరని సూచించారు. తను కూడా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వాడినేనని, మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆర్ధిక ఇబ్బందులు తనకు బాగా తెలుసని విద్యార్థులకు వివరించారు. చదువుకు పేదరికం ఎప్పుడు అడ్డు కాకూడదని పేర్కొన్నారు. అందుకోసమే అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ సాధనలో సఫలం కావాలని ఆకాంక్షించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏకగ్రత తో చదివితేనే ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని తెలిపారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ చక్కటి అవకాశాన్ని కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ చదవడం అంటే కేవలం బుక్ లో ఉన్నది చదవడం కాదని సబ్జెక్ట్ ను అర్థం చేసుకొని అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రణాళిక బద్దంగా చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
వరంగల్ సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి పాజిటివ్ దృక్పధంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఒక కచ్చితమైన గోల్ పెట్టుకొని దానికి అనుగుణంగా సాధన చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయని వాటిని అదిగమించినప్పుడే విజయాన్ని అందుకోగలమని సూచించారు.
ఈ కార్యక్రమంలో అరూరి గట్టుమల్లు చైర్మన్ అరూరి విశాల్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పూజ, పోలీస్ అధికారులు, వర్దన్నపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నిరుద్యోగ యువతి, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments