Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
– ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన

మెట్ పల్లి, ఏప్రిల్ 15 (ప్రజా కలం ప్రతినిధి) : మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మెట్ పల్లి మండలంలోని వేంపేట గ్రామానికి చెందిన పెంటపర్తి వామన్ తన భార్య ప్రసన్నకు పురిటి నొప్పులు రావడంతో గురువారం కాన్పు కోసం అత్తమామతో కలిసి మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా డ్యూటీలో ఉన్న నర్సు పరిశీలించి పేషెంట్ రిపోర్ట్ లను వాట్సప్ ద్వారా డ్యూటీ డాక్టర్ కు పంపించగా 9 గంటలకు ఆపరేషన్ చేద్దామన్నట్లు తెలిపిన నర్సు, రాత్రి ఆపరేషన్ థియేటర్ కి పేషెంట్ ను తరలించారు. కానీ డాక్టర్ రాకపోవడంతో, ఉదయం 6 గంటలకు ఆపరేషన్ చేద్దామని నర్సు తెలిపినట్లు పేషెంట్ బందువులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆపరేషన్ చేస్తానన్న వైద్యురాలు 9 గంటల తరువాత ఆపరేషన్ చేయగా శిశువు మృతిచెందినట్లు తెలిపారు. సరైన సమయంలో డాక్టర్లు స్పందించి ఉంటే బిడ్డ బ్రతుకేదని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులను నడుపుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments