సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణ గాలికి
– విద్యార్థులను బెదిరిస్తున్న రెగ్యులర్ టీచర్లు
– నిద్రావస్థలో అధికారులు
– ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
పర్వతగిరి, ప్రజాకలం ప్రతినిధి, ఏప్రిల్15: పర్వతగిరి మండలంలో గల విద్యార్దుల గురుకుల పాటశాలల్లో సంక్షేమాన్ని నిర్వాహకులు గాలికి వదిలేసారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆశ్రమ పాటశాలలో నీటి సౌకర్యం లేక విద్యార్థులు వ్యవసాయ భావుల దగ్గరినుండి నీటిని బకెట్లతో తీసుకురావడం, ప్రమాదకరంగా ఉన్న బావుల దగ్గర స్నానాలు చేయడం శుక్రవారం ధర్శనిమిచ్చింది. మిట్టమధ్యాహ్నం రోడ్డుపై బకెట్లతో నీటిని తేచుకుంటున్న విద్యార్థుల అవస్థలు సంక్షేమ హాస్టళ్ళ పట్ల నిర్వహకులు, వాటిని పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్య వైఖరిని కళ్ళకు కడుతుంది. కొన్ని హాస్టళ్ళలో రాత్రిపూట కేర్‌టేకర్ ఉండరు. రాత్రి వేళల్లో ఉండాల్సిన వాచ్మెన్ 9 గంటలవరకే ఉద్యోగం చేసి అదే హాస్టల్ లో ఉండే విద్యార్థికి వాచ్మెన్ భాధ్యతలు అప్పగించి వెళ్తుంటారని విద్యార్థులు తెలిపారు. శిథిలావస్థలో ఉన్నమరుగుదొడ్లు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ కనెక్షన్లు, భోజనం, త్రాగునీరు, అధ్వాన్నంగా ఉన్న వసతి గృహాల వంటి సమస్యలు ఎన్ని ఉన్నా అధికారులు ఆ వైపు కూడా చూడడం లేదు. హాస్టళ్ళ నిర్వహకుల విధులు హాజరు పట్టిక వరకే పరిమితం అవుతున్నా వాళ్ళపై ఏ ఉన్నతాధికారి తనిఖీలు నిర్వహించడం, చర్యలు తీసుకోవడం వంటి జాడే లేదు. గురుకులాల్లో జరిగే ఎలాంటి సమస్యనైనా బయటికి వాళ్లకి చెప్తే తాటతీస్త అని విద్యార్థులను బ్లాక్ మెయిల్ చేయడం అందులో పని చేసే రెగ్యులర్ టీచర్ల విధి అని విద్యార్థులు వాపోతున్నారు.