మండి పడుతున్న తెరాస నేతలు / పోలీసులకు ఫిర్యాదు
జగిత్యాల ప్రతినిధి, ఏప్రిల్28(ప్రజాకలం):
తెరాస ఆవిర్భావ వేడుకలో జెండా ఎగరేసి పండగను జరుపుకొన్నామనే సంతోషాన్ని కొందరు గుర్తుతెలియని కొద్దికాలంపాటు జరుపుకొనియ్యని సంఘటన జగిత్యాల పట్టణంలో నెలకొంది. జగిత్యాల పట్టణములోని ఒకటవ వార్డులో విజయపురిలో ని దొడ్డికొమురయ్య విగ్రహం వద్ద మంగళవారం తెరాస నేతలు, శ్రేణులు తెరాస జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు వైభవంగా జరిగిన తెరాస జెండా పండుగతో జీర్ణించుకోలేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గతరాత్రి జెండగద్దెను కూల్చి వేశారని ఇదెక్కడి అన్యాయమని ఆ వార్డు తెరాస కౌన్సిలర్ కూసరి అనిల్ ఆవేదనతో అన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది, స్థానిక తెరాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉండగా ఇంతటి దారుణానికి ఓడిగట్టడం బాధాకరమన్నారు.ఈ సంఘటనకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వారిపై చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించేది లేదని కూసరి అనీల్ పేర్కొన్నారు.