* మహిళల ఆర్థిక స్వావలంబనకు పర్యావరణ హితంగా*
జగిత్యాల ప్రతినిధి,ఏప్రిల్28(ప్రజాకలం)
విస్తరాకుల ప్రాజెక్టుల వల్ల విస్తృతంగా ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 43 వ వార్డులో లలిత లీఫ్ ప్లేట్స్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మోదుగ, అడ్డాకుల, చెరుకుగుజ్జుతో విస్తరాకులు టిఫిన్ ప్లేట్లు స్పోర్క్లు,స్పూన్లు తయారుచేసే ప్లాంటేషన్ గురువారం ప్రారంభించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడం లో భాగంగా ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులైన మోదుగ, అడ్డాకుల, చెరుకు గుజ్జు లాంటి వాటితో పర్యావరణ కు ఎలాంటి విఘాతం కలగకుండా బహుళ ప్రయోజనాల వస్తువుల ఉత్పత్తులతో పాటు నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నిర్వహణకు ముందుకు వచ్చిన లలిత లీఫ్ ప్లేట్స్ తయారీ మహిళా గ్రూపును చైర్పర్సన్ అభినందించారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఆకులతో చేసిన విస్తర్లే కాకుండా మట్టితో తయారు చేసిన గ్లాసులు, కప్పులు తయారీతో ప్లాస్టిక్ వినియోగం తగ్గడమే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మహిళా సమాఖ్య లో 10 నుండి 12 గ్రూపులు ఉంటాయని ఒక వార్డుకు ఒక సమాఖ్య ఒక్కో వార్డులో రెండు కూడా ఉంటాయని అన్నారు. ప్రస్తుతం వీటి లో 24 వేల సభ్యత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. సభ్యత్వం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కొత్త కొత్త ఆలోచనలతో మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారిని నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నిస్తున్నామని ఇప్పటికే దానిలో భాగంగా పెన్సిల్ మిషన్, బ్యూటీ పార్లర్ మిషన్, వెదురు బుట్టలు అల్లడం లాంటి వివిధ రకాల ఆలోచనలతో మహిళలు సాధికారత వైపు అడుగులు వేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడం గొప్ప విషయమన్నారు. ప్లాస్టిక్ వస్తువులు అమ్మే వారు వాటికి ప్రత్యామ్నాయం చూపించాలని అడుగుతున్నారని అన్నారు.మహిళా సమాఖ్యలు కుటీర పరిశ్రమలలో చేసిన ఉత్పత్తులను వినియోగంలోకి వచ్చేలా సమాఖ్యలకు వ్యాపారస్థులు సహకరించాలని ఆమె కోరారు.దీంతో పట్టణంలో ప్లాస్టిక్ వాడకం తగ్గుతుందని పర్యావరణం సమతుల్యతతో ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఆకులతో చేసిన వస్తువుల వినియోగం తర్వాత నశ్వరముతో వర్మీ కాంపోస్ట్ గా తయారు చేసి వినయోగించ వచ్చునని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ స్వరూపరాణి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,వార్డు కౌన్సిలర్ లు సిరికొండ. పద్మ, బద్దంలత మహిళ సభ్యురాల్లు పాల్గొన్నారు