Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedసోదర భావానికి ప్రతీక ఇఫ్తార్ విందు -మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు

సోదర భావానికి ప్రతీక ఇఫ్తార్ విందు -మాజీ ఎమ్మెల్యే విజయరమణా రావు

ముస్లీం మత పెద్దలతో కలిసి తొలుత ప్రత్యేక ప్రార్థనలు

పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్,ఏప్రిల్ 28:(ప్రజాకలం ప్రతినిధి)

పవిత్ర రంజాన్ సందర్భంగా హిందూ,ముస్లిం సోదరులు సమైక్యంగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి,సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని మదీన మజీద్ లో ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందును విజయరమణ రావు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముస్లీం మత పెద్దలతో కలిసి తొలుత ప్రత్యేక ప్రార్థనలు అనంతరం విజయరమణా రావు మాట్లాడుతూ సమాజంలో సర్వ మానవాళి హృదయాలను ప్రేమ,అభిమానులను వికసింపజేసి సోదరభావం, సమానత్వాన్ని పెంపొందించే పండుగ రంజాన్ అని పేర్కొన్నారు.ఈ మాసం సర్వ మత సామరస్యంను నిర్మించడంతో పాటు ఇతర మతాలను గౌరవించు కోవడంలో ఎంతో ప్రాధాన్యత,సంతోషకరమైన అవకాశాలను రంజాన్ మాసం కల్పిస్తున్నట్లు తెలిపారు.మన చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి సోదరభావాన్ని పెంపొందించుకోవడానికి ఇఫ్తార్ విందులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ సభ్యులు గొరేమియ,ఆఫీజుద్దీన్,ఖదీర్,రహీమ్,ఖదీర్, రహీమ్,రాజ్మాహమా ద్,మండల అధ్యక్షుడు ఎం.డీ.మునీర్,తులా మనోహర్ రావు,ఎంపీటీసీ రావి సదానందం,బంగారు రమేష్,మాజీ సర్పంచ్ గజేవెన సదయ్య,రణేవెన శ్రీనివాస్, కాల్వ వేమరెడ్డి,అల్లం దేవందర్,కట్టకూరి రాజిరెడ్డి,సబ్బాని రాజమల్లు,రణవేన క్రాంతి,గోలి రమణయ్య,శ్రీకాంత్,ఎనగంటి వినయ్,మెట్టు శ్రీశైలం,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments