Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedఅన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న తెరాస ప్రభుత్వం

అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న తెరాస ప్రభుత్వం

మత సామరస్యానికి,సోదర భావానికి ప్రతీక
ఇఫ్తార్ విందు… డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మల్లాపూర్,ఏప్రిల్29:(ప్రజాకలం ప్రతినిధి)

పవిత్ర రంజాన్ సందర్భంగా హిందూ,ముస్లిం సోదరులు సమైక్యంగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి,సోదర భావానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్లీం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లీం మత పెద్దలతో కలిసి తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ సమాజంలో సర్వ మానవాళి హృదయాలను ప్రేమ,అభిమానులను వికసింపజేసి సోదరభావం పెంపొందించే పండుగ రంజాన్ అని పేర్కొన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న తెరాస ప్రభుత్వం ప్రతిఒక్కరికి అండగా నిలుస్తున్నదని అన్నారు.రాష్ట్రంలోని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్నట్లు సంజయ్ పేర్కొన్నారు.అనంతరం మజీద్ కమిటీ సభ్యులు డాక్టర్ సంజయ్ ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ తోట రవీందర్ ఎంపీపీ కటిపెళ్లి సరోజన అదిరెడ్డి, జడ్పీటీసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ ఎంపీపీ గౌరు నగేష్,ఎంపీటిసి ఆకుతోట రాజేష్ తెరాస నాయకులు తోట శ్రీనివాస్, కదుర్కు నర్సయ్య,కటిపెల్లి అదిరెడ్డి కోఆప్షన్ సభ్యులు ఎండి సత్తార్, సర్పంచ్ హైదర్ హుస్సేన్ ,మజీద్ కమిటీ సభ్యులు మైబూబ్,మహ్మద్ రఫీ,పాషా మదర్,సదుల్లా,రాజ్ మహ్మద్ ,మేరాజ్,మహ్మద్ రఫీ,అమినోద్దీన్, తెరాస నాయకులు, కొమ్ముల జీవన్ రెడ్డి ,క్యాతం జీవన్ రెడ్డి,లింగ స్వామి గౌడ్ ,ముద్దం శరత్ గౌడ్,ఊరేడి రవి,పెద్దిరెడ్డి లక్ష్మణ్,మ్యాకాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments