Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం...

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం…

కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం…
– మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ
– మెట్ పల్లిలో మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం

మెట్ పల్లి, ఏప్రిల్ 29 (ప్రజాకలం ప్రతినిధి) : కౌన్సిల్ సభ్యులు కలిసి కట్టుగా ఉండి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. సమావేశం సందర్భంగా కౌన్సిల్ సభ్యులు తమతమ వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. పట్టణంలోని అన్ని వార్డులో మంచినీటి సమస్య ఉందని, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా వార్డుల కౌన్సిలర్లు మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ మిషన్ భగీరథ డీఈతో మాట్లాడి సమస్యను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. భగీరథ డీఈ మాట్లాడుతూ పట్టణంలో మొత్తం పన్నెండు వేల నల్ల కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు పదకొండు వేల కనెక్షన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొన్ని వార్డుల్లో పైప్ లైన్ గ్యాప్ లను కలిపే పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పనులను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. కాగా సమావేశంలో ప్రవేశపెట్టిన 14 ఎజెండా అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మెట్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో వేసవికాలం దృష్ట్యా మంచి నీటి ఎద్దడి లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించడానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సంపూర్ణ సహకారంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ పథకాలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు దృష్టిసారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments