Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్ట పరిహారం అందించాలి

ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్ట పరిహారం అందించాలి

ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్ట పరిహారం అందించాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతుల్లో ఆందోళన
అకాల వర్షంతో రైతులు అతలాకుతలం
ఆరంభం సరే తూకం సంగతేంటి..?
వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన 
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 
రాయికల్, ఏప్రిల్ 29 (ప్రజాకలం ప్రతినిధి)
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అంది విక్రయించే సమయంలో అకాల వర్షం అన్నదాతపై కురిసి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్ట పరిహారం అందించాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాయికల్ మండలంలో గురువారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి,నువ్వు,మొక్కజొన్న పంటలను అయోధ్య,ఉప్పుమడుగు,చింతలూర్ గ్రామాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.అనంతరం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలతో రైతులు ఆందోళనకు గురై నీరు ఉండి కూడా పంట వేయలేకపోయారని పండించిన పంట కాస్తా కోత సమయంలో రైతుల ఆశలు అకాల వర్షంతో పంట నష్ట పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కల్లాల్లో పోసిన ధాన్యం తూకం కాక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.త్వరితగతిన కొనుగోళ్లు చేపడితే అకాల వర్షాల నుండి పంట నష్టపోకుండా కాపాడవచ్చన్నారు.రోజురోజుకు వాతావరణంలో వచ్చే మార్పులతో కళ్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారని వాపోయారు.సన్న వడ్లు పండించిన రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ తో చరవాణిలో సమాచారం కోరగా దొడ్డురకం వడ్లు క్వింటాల్ ధర రూ.1960 కేంద్రాల్లో కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.రెవెన్యూ,వ్యవసాయ అధికారులు ఉమ్మడి పర్యవేక్షణతో పంట నష్టపోయిన రైతుల వివరాల నివేదికను ప్రభుత్వానికి అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యం కింద పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలిచి ఇన్ పుట్ సబ్సిడీ అందించి రైతులను ఆదుకో లేకపోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యమా.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా అని విమర్శించారు.అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ .20 వేలు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తూకం లో జాప్యం లేకుండా అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గోపి రాజారెడ్డి,కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు రవీందర్ రావు,మ్యాకల రమేష్ ,ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్,ఎంపీటీసీ కొమ్ముల రాధ ఆదిరెడ్డి,భూపతిపూర్ సింగిల్ విండో డైరెక్టర్ కొసరి మహేష్,జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కొయ్యేడి మహిపాల్ రెడ్డి,ఎద్ధండి దివాకర్,బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య,మున్ను,చౌడరపు లక్ష్మీనారాయణ,గంగారెడ్డి,కడకుంట్ల నరేష్,మండ రమేష్,రాజేందర్,అశోక్,మధు,నర్సింహారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.     

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments