Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కామపిశాచి

భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కామపిశాచి

-భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కామపిశాచి-
– నిండు గర్భిణీపై ప్రసవసమయంలో లైంగిక వేధింపు –
– గగ్గోలు పెట్టిన బాధితురాలు –
– కామపిశాచికి 60 ఏళ్ళు , బాధితురాలికి 26 ఏళ్ళు –
– గతంలో కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు –
– బాధితురాలు అదే ఆసుపత్రిలో ఏ ఎన్ యం-
– కామపిశాచి అదే ఆసుపత్రిలో 4 వ తరగతి ఉద్యోగి-

భద్రాచలం ప్రజాకలం ప్రతినిధి : భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కామపిశాచులు తిరుగుతున్నాయి …..ఒక పక్క ప్రభుత్వం , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు , సౌకర్యాలు మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుంటే ….అదే ఆసుపత్రిలో కొందరు ఉద్యోగులు కామపిశాచిలుగా తయారై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు .
అటువంటి నీచ , నికృష్ట , దగుల్బాజీ ముదనష్టపు సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది .
వావి వరసలు లేకుండా ….మానవత్వం లేకుండా , కనీస ఇంగితం లేకుండా ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన , సహచర ఉద్యోగి ,
నిండుచూలాలు అయిన ఒక యువతిపై జరిగిన లైంగిక వేధింపు గురించి వింటే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది .
రాక్షస , పైశాచిక ఆనందం కోసం ఒక కామపిశాచి వ్యవహరించిన తీరు గమనిస్తే …..బాధితురాలు మనకు ఎవరో తెలియకపోయినా …కనీసము మానవత్వం కలవారి రక్తం ఆగ్రహావేశాలతో
సలసలా మరగటం మాత్రం ఖాయం .
ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి .
భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రసవం కోసం భద్రాచలం
ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది . ప్రసవసమయం లో వైద్యుడు ఆ యువతికి మత్తు ఇచ్చారు .
వైద్యో నారాయణో హరి అన్న విధంగా ఆ వైద్యుడు చిత్తశుద్దిగా , త్రికరణశుద్ధిగా ప్రసవ ప్రక్రియ చేస్తున్నాడు .
మత్తువలన గుండె నుండి కింద భాగం వరకు మత్తులో ఉన్న ఆ యువతికి స్పర్శ ఉండదు .
ఆ సమయంలో డాక్టర్ పక్కన ఉన్న ఒక 4 వ తరగతి ఉద్యోగి అయిన 60 సంవత్సరాల వయసు ఉన్న ఒక కామపిశాచి
ఆయువతి స్థనాలపై చేతులు వేసి పిసుకుతున్నాడు. దీనిని గమనించిన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది .వెంటనే విషయాన్ని
గమనించిన వైద్యుడు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై , కామపిశాచి పై నిప్పులుగక్కాడు .
అక్కడినుండే ఆ డాక్టర్ ఒక ఉన్నతాధికారికి దీనిపై ఫిర్యాదు చేసాడు .
ఇంత నీచపు సంఘటన జరిగితే ….దీనిని మరుగున పరచడానికి కూడా ఇదే వైద్యశాలలో కొంతమంది ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి . ఈ సంఘటనపై ఎటువంటి పోలీస్ ఫిర్యాదు చెయ్యొద్దని కామపిశాచి వత్తాసు బృందాలు సదరు బాధితురాలికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది . గతంలో ఇదే కామపిశాచిద్వారా తమ
లైంగిక సుఖాలకోసం సహాయ సహకారాలు తీసుకున్న కొందరు జూనియర్ కామపిశాచులు ఈ సీనియర్ కామపిశాచిని కాపాడటానికి ….సిగ్గూశరం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి .
గతంలో అనేక సందర్భాలలో ఇటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలు వైద్యుల మొదలు , కిందిస్థాయి సిబ్బంది వరకు
అనేకమంది మీద వచ్చిన సందర్భాలు కోకొల్లలు..
గౌరవం కల వ్యక్తులు , మాన , మర్యాదలు గల వ్యక్తులు భద్రాద్రి ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేయాలన్నా
, వైద్యం కోసం రావాలన్నా భయపడే భయంకర పరిస్థితులు ఇక్కడ ఉన్నట్లు జరిగిన తాజా సంఘటన స్పష్టం చేస్తున్నది .
సదరు కామపిశాచికి 65 ఏళ్ళు పైనే ఉన్నా , రికార్డులలో తక్కువ వయసును నమోదు చేసుకుని ….ఉద్యోగం చేస్తూ తన నీచ నికృష్ట నిజాన్ని ప్రదర్శిస్తున్నాడని , ఇది ఈ కామపిశాచికి
చిత్తకార్తె కుక్కలాంటి సహజమైన అలవాటని సమాచారం .
దీనిపై ఉన్నత న్యాయవ్యవస్థ , జిల్లా కలెక్టర్ , ఎస్ పీ లు స్పందించి సూమోటో కేసునమోదు చెయ్యాలని భద్రాచల పట్టణ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు . ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవు అన్న భరోసా కూడా ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ భద్రాచలం ప్రాంతం ప్రజలు అంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments