Saturday, May 21, 2022
Google search engine
Homeక్రైమ్మహిళల సొమ్ము కాజేస్తున్న సిపి

మహిళల సొమ్ము కాజేస్తున్న సిపి

మహిళల సొమ్ము కాజేస్తున్న సిపి
మహిళలు లోన్ తీసుకుంటే సీపీకి నగదు చెల్లించాలి
ప్రభుత్వ వేతన తీసుకుంటూ రాజకీయంలో సిపి యాదగిరి

మెదక్ ఏప్రిల్ 29 (ప్రజాకలం ప్రతినిధి)మహిళల సొమ్ము కాజేస్తున్న సిపి యాదగిరి,అవినీతికి మారుపేరుగా కొల్చారం ఐకెపి కార్యాలయం మారినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.ఐకెపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిపి యాదగిరి ఇటు ప్రభుత్వ ఉద్యోగం,అటు రాజకీయ నాయకుడా అని అంతుచిక్కని పరిస్థితిలో మహిళా సమైక్య సంఘాల సభ్యులున్నారు.ప్రభుత్వ వేతనం తీసుకుంటూ కార్యాలయంలో విధులకు గైర్హాజర్ అవుతూ తన సొంత గ్రామంలో రాజకీయంగా పంచాయతీలు చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీలో ప్లెక్సీలు వేసుకొని రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు.దీంతోపాటు కొల్చారం మండలంలో ఐకేపీ ద్వారా నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం పరంగా వచ్చే కమిషన్లకు లెక్కలు చూపించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.దీనిపై ఐకేపీ ఏపీఎం దేవా సుశీల్వను వివరణ కోరగా అలాంటిది ఏమి లేనట్లుగా ఆమె వత్తాసు పలికారు.సిపి కొనసాగుతున్న యాదగిరి ఆయన పరిధిలో మహిళా సమైక్య సంఘాల సభ్యులు ప్రభుత్వం పరంగా ఇచ్చే రుణాలకు ఒక్క మహిళ సమైక్య సంఘ సభ్యురాలు లోన్ తీసుకోవాలంటే సీపీకి ముందుగా ఎంతో కొంత ముడుపులు చెల్లించు కోవల్సిందే.అలా చెల్లించుకోకపోతే లోను మంజూరు అయ్యే పరిస్థితులు లేవు అలాగే ఐకెపి కార్యాలయంలో ఏపిఎం దేవ సుశీల్వ,సి పి యాదగిరి లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తు,సిబ్బందిపై కూడా పలు ఇబ్బందులకు గురి చేస్తూ నిత్య వారికి అన్యాయం చేసినట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా కంప్యూటర్ ఆపరేటర్ ఎంఎస్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది,అట్టి సమావేశంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సంఘ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి టి,స్నాక్స్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది.అలాంటివి ఏవి పెట్టకుండా ఐకెపి ఏ సీఎం బిల్లా రూపేనా డబ్బులు డ్రా తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.అది కూడా ఒక నెల 5000 మరో నెల 6000 వేలు ఇలా ఇష్టం వచ్చినట్లుగా బిల్లులు డ్రా చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహించిన అతనిపై కక్ష కట్టి సుమారు 3 నెలల వేతనం చెల్లించకుండా అతనిని ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఐకెపి సిబ్బంది ప్రతినిత్యం కార్యాలయానికి వచ్చి మండల పరిధిలోని ఏ గ్రామంలో అయితే మహిళా సంఘ సభ్యులతో సమావేశాలు నిర్వహించాలో అక్కడికి వెళ్లాలి ఉంటుంది అలా కాకుండా ఏపీ ఎంతో సహా సిబ్బంది వారి ఇష్టానుసారంగా రాకుండా గ్రామంలోని ఉంటూ మేము అక్కడ గ్రామానికి వెళ్ళమని హాజరు వేసుకున్న దరఖాస్తులు ఎన్నో ఉన్నాయి.అలా కాకుండా ప్రతి నిత్యం 10 గంటలకు రావాల్సిన సిబ్బంది ఇష్టానుసారంగా 11 గంటలకు ఇలా వచ్చి అలా వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.అందులో మండల పరిధిలోని నలుగురు సి సి లు ఉండగా అందులో ఒక సి సి యాదగిరి ప్రభుత్వం పరంగా వేతనం తీసుకుంటూ బిజెపి కార్యకర్త గా కొనసాగుతూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేసుకొని ఫోటోలకు పోజూలిస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.దీంతోపాటు గ్రామాలలో రాజ కీయ నాయకుడిగా చలామణి అవుతూ ఎన్నో పంచాయతీలు చేస్తూ ఎన్నో కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.తాజాగా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన డాకమ్మేల నాగేష్ దొంగతనం కేసు విషయంలో సి సి యాదగిరి కల్పించుకొని అతనిపై పలు ఆరోపణలు చేయడంతో అతని కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇలా కొనసాగితే మహిళా సమైక్య సంఘ సభ్యులు అభివృద్ధి చెందకపోవడంతో పాటు కష్టమయ్యే పరిస్థితులే అధికంగా ఉన్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.అలాగే మహిళా సమైక్య సంఘ సభ్యులు అభివృద్ధి చేయకపోవడంతో పాటు నష్టపోయే పరిస్థితులే అధికంగా ఉన్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు.అలాగే మహిళా సమైక్య సంఘం తరఫున ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి మండల పరిధిలోని అన్ని మహిళా సమైక్య సంఘ సభ్యులతో కలిసి ఒక మండల సమైక్య సంఘం అధ్యక్షురాలిగా ఒకరిని నియమించు కోవడం జరుగుతుంది.అలాంటి ఏపిఎం దేవాసుశీల్వ,సి పి యాదగిరి అండదండలతో గ్రూపు నిరంతరంగా కొనసాగకుండా అట్టి గ్రూపులోని సభ్యురాలు మహిళా సమైక్య అధ్యక్షురాలుగా గత మూడు నుండి నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.దీంతో ఇటు మహిళ సమాఖ్య సంఘం సభ్యులకు ఎలాంటి ఉపయోగం లేదు,కానీ ఏపీఎంకు సీసీకి మిరా లాభం ఉందో తెలియడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నత అధికారులు స్పందించి అవకతవకలకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments