మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
ఈద్గా ను ప్రారంభించిరంజాన్ తొఫాల ను పంపిణీ చేసిన
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నాగరం/నందుపల్లి/మహేశ్వరం ఏప్రిల్ 29 (ప్రజా కలం)
మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం నాగారం నందుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పండుగలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈద్గా ను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
కులమతాలకు అతీతంగా రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు సందర్భంగా నందు పల్లి గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ మాస చివరి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మైనార్టీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసిందని అన్నారు. మైనార్టీ సంక్షేమం మైనార్టీ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాద్ రెడ్డి నాగారం గ్రామ సర్పంచ్ బండారు లావణ్య
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు నాయక్ చంద్రయ్య పిఎసిఎస్ చైర్మన్ పాండు యాదవ్ డైరెక్టర్ ప్రభాకర్ కో ఆప్షన్ సభ్యులు అదిల్ అలీ ఎం ఏ సమీర్ మునగాపాటి నవీన్ దేశముఖ్ సంజయ్ ఎం గోపాల్ నాయక్ అంజయ్య యాదవ్ నందు పల్లి గ్రామ సర్పంచ్ కళావతి కిష్టయ్య ఉప సర్పంచ్ ఉస్మాన్ కో ఆప్షన్ సభ్యులు చోటే ఖాన్
టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు హాబీబ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.