Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌వాడివేడిగా సర్వసభ్య సమావేశం

వాడివేడిగా సర్వసభ్య సమావేశం

వాడివేడిగా సర్వసభ్య సమావేశం
– ఆర్టీసి, విద్యుత్, మిషన్ భగీరథ సమస్యలపై అధికారులను నిలదీసిన సర్పంచులు ,ఎంపీటీసీలు
యాచారం, ఏప్రిల్ 29, (ప్రజాకలం ప్రతినిధి): మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. శుక్రవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపిపి కొప్పు సుకన్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పలు శాఖల అధికారులను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించారు. తక్కళ్ళపల్లి తండా సర్పంచ్ జగదీష్ నాయక్ మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలపై పలుమార్లు ప్రజలు అధికారుల దగ్గరకు వెళితే ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు. తండాకు చెందిన ఓ వ్యక్తి దగ్గర విద్యుత్ సమస్య కోసం అధికారుల దృష్టికి వెళ్తే ఓ అధికారి లంచం ఇస్తే నీ పని చేస్తాను అంటూ లంచం తీసుకున్నారని చెప్పారు. డబ్బులు ఇచ్చినా కానీ ఆరు నెలలుగా పనిచేయకపోవడంతో లబ్ధిదారులు సర్పంచ్ దృష్టికి తీసుకు వచ్చారని, అధికారి సర్పంచ్ విషయం తెలపగా డబ్బులు ఇచ్చాడు కానీ పనులు మాత్రం చేయడం లేదని అన్నారు. విద్యుత్ అధికారులు వెంచర్ల పై చూపే శ్రద్ధ ప్రజల సమస్యలపై చూపడం లేదని, విద్యుత్ అధికారులు ఉన్నది వెంచర్ల లో పని చేయడానికా.. ప్రజల కోసం పని చేయడానికా.. అని ప్రశ్నించారు. మళ్లీ వచ్చే సర్వసభ్య సమావేశం వరకు గ్రామంలో విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సర్పంచులు జగదీష్ నాయక్, హాభిబ్ మండల అధికారులను కోరారు. గ్రామాలలో విద్యుత్ తీగలు మరియు ట్రాన్స్ఫార్మర్లు అతి ప్రమాదకరంగా ఉన్నాయని గత సంవత్సర కాలంగా అధికారులను కోరుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని కనీసం సర్పంచులను కూడా గౌరవించడం లేదని ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ భాషయ్యా సమావేశంలో వివరించారు. గ్రామాలలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎండల తాకిడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారని, ఎండాకాలంలో నీటి కష్టాలు రాకుండా చూడాలని కొత్తపల్లి సర్పంచ్ హభిబ్ అధికారులను కోరారు. ప్రస్తుతం వస్తున్న నీరు గ్రామాల ప్రజలకు సరిపోక నీటి కష్టాలు తలెత్తుతున్నాయని, ఎండాకాలంలో నీటి కష్టాలు రాకుండా చూడాలని కోరారు. కరోనాకు ముందు నడిచిన బస్సులోనే మళ్ళీ యధావిధిగా పునరుద్ధరించాలని సర్పంచ్లు హాభిబ్, జగదీష్ నాయక్ ఆర్టీసీ అధికారులను కోరారు. ఆర్టిసి అధికారులను సమస్యలపై ఎన్నిసార్లు కలిపిన సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఆర్టీసి అధికారులు సమావేశాలకు వస్తున్నారు వెళ్తున్నారు తప్ప సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రతి గ్రామానికి సరిపడ బస్సులో నడిపించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎటువంటి ప్రమాదాలు జరిగినా దానికి పూర్తి బాధ్యత ఆర్టీసి అధికారులు వహించాల్సి వస్తుందని తెలిపారు.
ఆర్టీసీ సిబ్బంది బతుకులను గజ్జి కుక్కల చేసింది రాష్ట్ర ప్రభుత్వం
ఆర్టీసీ సిబ్బంది బతుకులను గజ్జికుక్కల చేసిందని ఆర్టిసి అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్టీసీ అధికారుల తరఫున సత్యనారాయణ అనే ఉద్యోగి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఆర్టీసి అధికారులకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు వెళ్లి మాట్లాడుతుండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది బతుకులను గజ్జి కుక్కల చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్జి కుక్కల చేశారు అనే పదం పై తక్కలపల్లి తండా సర్పంచ్ జగదీష్ నాయక్, కొత్తపల్లి సర్పంచ్ హబీబ్ అధికారి సత్యనారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపడంతో ఎంతో మంది ఆర్టీసీ సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అని కానీ ఓ ఉద్యోగి అయిన సత్యనారాయణ రక్తం గురించి మాట్లాడడం సమంజసం కాదని తెలిపారు. సత్యనారాయణ పై అధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కావున మండల ప్రజా ప్రతినిధులు అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, తాసిల్దార్ మహబూబ్ అలీ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశానికి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు డుమ్మా
శుక్రవారం యాచారం మండల కేంద్రంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. ఈ సందర్బంగా ఎంపిపి మాట్లాడుతూ… సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్వసభ్య సమావేశానికి రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో అధికారులపై మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments