Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedవరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు..ఎంపీపీ కటిపెల్లి సరోజన

మల్లాపూర్,మే02,(ప్రజాకలం ప్రతినిధి)

మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి,కుస్థాపూర్ రాఘవపెట్ ,వెంపల్లి,మోగిలిపెట్ ముత్యంపెట్ వాల్గొండ,గ్రామాల్లో సోమవారం ఐకెపి సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ కటిపెల్లి సరోజన అదిరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని,దళారులను నమ్మి మోస పోవద్దని ఎంపీపీ అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల కష్టాలను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూసి చలించిపోయారని అందుకే నేడు రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు.రైతు బంధు,రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తోట రవీందర్,ఐకెపి ఏపియం రాజేష్ ఎంపీపీ కటిపెల్లి సరోజన అదిరెడ్డి,వైస్ ఎంపీపీ గౌరు నగేష్, ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి,డిసియంఎస్ జిల్లా డైరెక్టర్ తకల్ల నరేశ్ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచ్ లు బొల్లం కృష్ణ వేణి, ఉప సర్పంచ్ మహేష్ రెడ్డి, వనతడుపుల నాగరాజు ,నత్తినర్సయ్య,సరికేల మహిపాల్ మార్కెట్ కమిటీ చెర్మెన్ కదుర్కనర్సయ్య, తెరాస మండల అధ్యక్షులు తోట శ్రీనివాస్, తెరాస అధికార ప్రతినిధి కటిపెల్లి అదిరెడ్డి ,తెరాస సీనియర్ నాయకులు దేవ మల్లయ్య,బొల్లం గంగాధర్,వెంకట్ రెడ్డి,చింతల రమేష్ దౌడే గంగానర్సయ్య చిన్న గంగారాం బొల్లం రఘు గొడిసెల నర్సయ్య సుధలు విజయ్ తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments