Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedసిమెంట్ ఇటుక బట్టీలో బాల కార్మికులు

సిమెంట్ ఇటుక బట్టీలో బాల కార్మికులు

*బాల్యం బుగ్గి పాలు*

పెద్దపల్లి/కాల్వ శ్రీరాంపూర్,మే 03(ప్రజా కలం ప్రతినిధి)

అక్షరాలు దిద్దాల్సిన చిన్నారుల చేతులు పలుగు పార పడుతున్నాయి తల్లిదండ్రుల ఒడిలో సుకుమారంగా పెరగాల్సిన బాల్యం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా భవన నిర్మాణ పనులకు ఇటుక బట్టీ కార్మికులు గా చిన్నారుల భవిష్యత్తు బుగ్గిపాలు అవుతోంది మండలం లోని ఒక సిమెంట్ ఇటుక బట్టీ వ్యాపారి ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన కూలీల పిల్లల ను సైతం వదలకుండా తన ఇటుక బట్టి లో చిన్న పిల్లాడితో ఇటుకల కు నీళ్లు పట్టిస్తున్న దృశ్యం విలేఖరి కెమెరాకు చిక్కింది.ఏ ప్రజా ప్రతినిధి నోట విన్న వినిపించే మాటలు బాలల శ్రేయస్సే తమ లక్ష్యమని ఏ అధికారి మాట విన్న బాల్యం బండల పాలు కాకుండా చూడడమే తమ కర్తవ్యమని చట్టసభల్లో వాళ్ల భవిష్యత్తు కోసం గళమెత్తిన నేతల గొంతులు చట్టాలు ఎన్నో చేశాయి. బంగారు బాల్యాన్ని కాగితాలు గా భద్రపరిచి ఆచరణలో మాత్రం విస్మరించాయి. ఇప్పటికైనా సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు చిన్నారులపై శ్రద్ధవహించి వారి బంగారు భవిష్యత్తు బుగ్గిపాలు కాకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.బాలునితో పని చేపిస్తున్న ఇటుక బట్టి యజమానిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పలువురు కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments