Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedకాంగ్రెస్ హాయంలో రైతుల సంక్షేమనికి చేసింది శూన్యం*

కాంగ్రెస్ హాయంలో రైతుల సంక్షేమనికి చేసింది శూన్యం*

*రెచ్చగొట్టడం కాదు – ఆదుకుని అండగా నిలిచే ప్రభుత్వం మాది*

*ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ *

జగిత్యాల ప్రతినిధి మే05,:(ప్రజాకలం)

రైతులను రెచ్చ గొట్టడం కాదని, ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలవడం ప్రభుత్వల బాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడం చాలాబాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి దైర్యంగా సాహసోపేత నిర్ణయం తీసుకునీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని,రైతులు అదైర్య పడవద్దని భరోసా నిచ్చారు. తడిసిన ధాన్యం అరబెట్టెందుకు చర్యలు చేపట్టాలని, అధికారులతో తాను మాట్లాడతానని హామీ ఇచ్చారు .రైతులు అకాల వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ వర్షానికి టార్పాలిన్ కవర్లు కప్పుకొవాలని, ఎండకి ధాన్యాన్ని ఆరబెట్టాలనీ సూచించారు. రైతుల పక్షాన నిలిచి వారికి అండగా ఉంటామని రైతులు దైర్యంగా ఉండాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బందు పథకం కింద పెట్టుబడి సాయం అందించడంతో పాటుగా ,24 గంటల నిరంతర కరెంటు,రైతు భీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్నీ రైతులు, ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఎం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు డిమాండ్ చేశారు. కపట ప్రేమలతో రైతులను రెచ్చ గొట్టడం మానుకొవాలని హితావు పలికారు.ప్రకృతి వైపరీత్యాలకు ఎవరు అతీతులు కారని సందర్భంగా అన్నారు.ఎమ్మేల్యే వెంట జగిత్యాల పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,హస్నాభాద్ సర్పంచ్ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లారెడ్డి,చల్గల్ ఉప సర్పంచ్ పద్మ తిరుపతి,నాయకులు రాజ రెడ్డి,తిరుపతి,రైతులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments