మేట్ పల్లి, మే 05(ప్రజాకలం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేనేత బందు ప్రకటించడంతో గురువారం కోరుట్ల పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గుండెటి రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికుల కష్టాలు తెలిసిన మన సీఎం కేసీఆర్ చేనేత బందు ప్రకటించి చేనేత కార్మికుల జీవితాలలో వెలుగు నింపారని తెలిపారు.
28 వేల కోట్ల రూపాయల ప్రకటించి ఆత్మస్థైర్యం నింపే తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థైర్యంతో బతికేలా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్ ఏంబేరి నాగభూషణం, పోగుల లక్ష్మీరాజం, సంతోష్, అల్లే శశాంక్ పాల్గొన్నారు.