Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌బీజేపి బహిరంగసభను విజయవంతం చేయండి

బీజేపి బహిరంగసభను విజయవంతం చేయండి

బీజేపి బహిరంగసభను విజయవంతం చేయండి
– 14న తుక్కుగుడలో ప్రజాసంగ్రామయాత్ర రెండవ విడత ముగింపు సభ
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమీషా
– పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి
– రాష్ట్ర కిసాన్ మోర్ఛా ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, ఎంపీపీ కొప్పు సుకన్య
యాచారం, మే 11, (ప్రజాకలం ప్రతినిధి): ఈ నెల 14న తుక్కుగుడలో జరిగే బిజేపి బహిరంసభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కిసాన్ మోర్ఛా ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్, యాచారం మండల ఎంపీపీ కొప్పు సుకన్య పార్టీ నాయకులను కోరారు. బుదవారం యాచారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవీందర్ అధ్వర్యంలో పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీ నాయకుల కండ్లు తెరిచే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. యాచారం మండల పరిధిలోని 24 గ్రామాల నుంచి 3వేల మందితో సభకు వెళ్తామని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుల పని చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయిందని అన్నారు. రైతుబందు పథకం ప్రారంభం అయినప్పటి నుంచి రైతులకు పరిహారం చెల్లించలేదని తెలిపారు. డబుల్ ఇళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల చిన్నచూపు చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఆసరా లబ్ధిదారులకు పించన్లు సకాలంలో ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు ఎండ్లు గడిచిన ఇప్పటి వరకు ఒక్క కొత్త రేషన్ కార్డు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వలేని ప్రభుత్వము అధికారంలో ఎందుకని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీజేపి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా భువనగిరి ఇంచార్జి నాగిని యాదయ్య, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మొండిగౌరెల్లి ఉపసర్పంచ్ మేకల యాదగిరి రెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు గోగికర్ రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గొల్లపల్లి శ్రీధర్ గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి మారగోని శేఖర్, ఉపాధ్యక్షులు పత్తిరాజు, నాగానీ కుమార్, ప్రధాన కార్యదర్శి నడికుడి కృష్ణ, కార్యదర్శులు నీరటి బాలకృష్ణ, మాధవ్ చారీ, అధికార ప్రతినిధి బన్నే మల్లేష్, కోశాధికారి గుడుగుంట్లరామకృష్ణ తో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments