మృతుల కుటుంబానికి అండగా ఉంటా
– కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి
యాచారం, మే 11, (ప్రజాకలం ప్రతినిధి): మండల పరిధిలోని తమ్మలోనిగూడ గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మేడిపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల రాములు, తన కుమారుడు సోను మృతి చెందిన సంఘటన తెలుసుకున్న ఇబ్రహింపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి బుదవారం ఉదయం ప్రభుత్వ హస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ… తండ్రీ, కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు పెద్దదిక్కు కోల్పోయి రోడ్డున పడ్డారని ప్రభుత్వము వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదంతో ఒకే కుటుంబానికీ చెందిన ఇద్దరు మృతి చెందడం బాధాకరం అన్నారు. వారి కుటుంబానికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలపై వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంఎన్ఆర్ టీం, యువకులు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.