జగిత్యాల ప్రతినిధి, మే13,(ప్రజా కలం)
జగిత్యాల జిల్లా కేంద్రం లోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం లో 2022-23 సంవత్సరం కు గాను అడ్మిషన్లు ప్రారంభమైనట్లు స్పెషల్ ఆఫీసర్ మధులత తెలిపారు. తమ విద్యాలయం లో 6 ,7,8,9 తరగతులకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్మీడియట్ తెలుగు మీడియం, ఎంపిసి, బైపీసీ గ్రూపులలో బోధించనున్నట్లు తెలిపారు. ఆధునిక భవనం, హాస్టల్ వసతి, పోషకాహారం,విశాలమైన ఆట స్థలం తో పాటు అర్హత, అనుభవం గల టీచర్ల చే బోధించబడునని పేర్కోన్నారు. వీటి తో పాటు ఉచిత ఎంసెట్ కోచింగ్, సీసీ కెమెరాలతో 24 గంటల పర్యవేక్షణ కల్పించబడునని తెలిపారు. ఆసక్తి కల విద్యార్థులు కస్తూరిభా బాలికల విద్యాలయం లో సంప్రదించాలని కోరారు