Saturday, May 21, 2022
Google search engine
HomeUncategorizedజర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా.

జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండా.

గెలుపుకు సహకరించిన సహచర పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు

– జిల్లా ఐజేయూ అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు.

జగిత్యాల ప్రతినిధి,మే13,(ప్రజాకలం)

జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా యూనియన్ నూతన కమిటీ ముందుకు సాగుతుందని జగిత్యాల జిల్లా టియూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షులు చీటి శ్రీనివాస్ రావు అన్నారు.జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీ బాధ్యులను చొప్పదండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి అల్లావుద్దీన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తమ గెలుపుకు సహకరించిన సహచర పాత్రికేయ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ ల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ఎజెండా గా ముందుకు సాగుతామన్నారు.

ప్రేమతో తమ కమిటీని సన్మానించేందుకు వచ్చిన అల్లావుద్దీన్ కు జిల్లా ఐజేయు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, గాజుల నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పూడూరి శోభన్, కార్యవర్గ సభ్యుడు కోరేపూ రాజ్ కుమార్ తో పాటు సహచర పాత్రికేయులు చింత నరేష్, చింత లక్ష్మణ్, సిరిసిల్ల వేణు గోపాల్, నరహరి,రాజ గోపాలచారి తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments