Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedచేయూత సేవా సమితి పోస్టు కు విశేష స్పందన

చేయూత సేవా సమితి పోస్టు కు విశేష స్పందన

*వింత వ్యాధితో భాదపడుతున్న యువకుడి పై ఫేస్ బుక్ లో పోస్టు*

స్పందిస్తున్న దాతలు

*కొడుకు ను కాపాడలని తల్లిదండ్రుల వేడుకోలు*

*రాజన్న సిరిసిల్లా/రుద్రంగి, మే 16,(ప్రజాకలం ప్రతినిధి)*

వింత వ్యాధితో చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి దీనగాధ పై ‘మన చేయూత సేవా సమితి’ అనే ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో దాతలు కదిలి వస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అక్కినపెల్లి శంకర్ లక్ష్మీ దంపతుల కుమారుడు భూమేష్ గత కొంత కాలంగా వింత వ్యాధితో ప్రాణం తో పోరాడుతున్నాడు.

భూమేశ్ గల్ఫ్ వెళ్ళి వ్యాధి బారిన పడి ఇటీవల తిరిగి తన స్వంత గూటికి చేరుకున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో కొడుకు వైద్యానికి రూ. 3 లక్షలు అవసరమని వైద్యులు తెలుపగా భూమేష్ ను కాపాడుకునేందుకు ఉన్న ఒక్క ఆదారమైన ఇంటిని సైతం అమ్మకానికి పెట్టగా ఎవరు కొనడానికి ముందుకు రాకపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ‘మన చేయూత సేవా సమితి’ టీం సభ్యులు భాదిత కుటుంబాన్ని అక్కున చేర్చుకొని మీకు మేము అండగా ఉంటామని తమ సోషల్ మీడయా లో భాదితుని ఆరోగ్య స్థితిని పోస్టు చేయగా దాతలు కదిలి వస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొల్లి కుమార్ రూ. 10 వేలు, సిర్రం అంజయ్య రూ. 10 వేలు, ఎండీ సదుల్లా రూ. 5 వేలు టీం సభ్యుల ఆద్వర్యంలో సోమవారం భాదిత కుటుంబానికి అందజేసి మానవత చాటుకున్నారు.ఇంక ఎవరైన దాతలు స్పందించి కొడుకు భూమేష్ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు డబ్బులు పంపాలనుకునే వారు ఈ క్రింది బ్యాంకు అకౌంటుకు పంపండి.

Cantact : Akkinapelli Bhoomesh
917075317708.

Foundation Member :
Kathi Raju : 9390525068,

Akkinapelli Laxmi
A/C: 049710100003138
Union Bank Of India
Ifsc: UBIN0804975
RUDRANGI Branch
Rajanna Siricilla
Telangana.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments