ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్
జగిత్యాల, మే17,(ప్రజాకలం ప్రతినిధి)
భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ఈనెల 19 గురువారం రోజున ఉదయం 11 గంటల నుండి కరీంనగర్ హోటల్ మైత్రీ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని దళిత బహుజన ప్రజాసంఘాలతో కలిపి ఉమ్మడి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు.
మంగళవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో పేట భాస్కర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రవేటుపరం చేస్తు రిజర్వేషన్లకు తుట్లు పోడుస్తుందని రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలతోనే బిజెపి ప్రభుత్వం కేంద్ర మంత్రులు, ఎంపిలతో రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. మనుస్మృతిని మళ్లీ ఈదేశంలో కొనసాగించాలనే ఎత్తుగడలను చిత్తు చేసేందుకు జూన్ 11న నిర్వహించ తలపెట్టిన ‘రాజ్యాంగ రక్షణ మహార్యాలీ’ ని విజయవంతం చేయడం, భవిష్యత్ కార్యచరణపై చర్చించించేందుకే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు కావున అన్ని కుల,రైతు,విద్యార్థి, ప్రజాసంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పేట భాస్కర్ కోరారు.
ఈ సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా ఉపాద్యక్షులు కొండ వెంకటేష్ గౌడ్,జిల్లా నాయకులు కొంగర పవన్, బోనగిరి మల్లారెడ్డి,గజ్జెల రాజు,చౌలమద్ది వినోద్, జాగర్ల రాజయ్య,చిర్ర చందు తదితరులు పాల్గొన్నారు.