వరి ధాన్యం కొనుగోలు పై వార్త ప్రచురించిన విలేకరిపై నీ అంతు చూస్తాం అంటూ ఫోన్లో బెదిరింపులు
మెదక్: మే18(ప్రజాకలం ప్రతినిధి)
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూన్న విలేఖరి
కొల్చారం మండల పరిధిలోని అంసాన్ పల్లి సహకార సంఘం అధ్యక్షుని వల్ల తనకు ప్రాణహాని ఉందని కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన ప్రజాకలం విలేఖరి కొల్చారం పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో గత 20 రోజులుగా కొనుగోళ్ళు జరగడం లేదు లారీల కొరత హమాలి ల కొరత పేరుతో ధాన్యం తూకం వేయడం లేదు ఇటీవల కురిసిన వర్షం కారణంగా ధాన్యం తడిసి ముద్ధ అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఈ విషయమై ప్రజాకలం దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురించడంతో సహకార సంఘం అధ్యక్షులు మన్నె రాములు బుధవారం ఉదయం ప్రజాకలం దిన పత్రిక విలేఖరి పాండురంగచారికి ఫోన్ చేసి అసభ్యకర పదజాలంతో దూషిస్తు నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.దమ్ముంటే అంసాన్ పల్లికి రావాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు.దీంతో తనకు మన్నే రాములు వల్ల ప్రాణహాని ఉందంటూ పాండురంగచారి బుధవారం విలేకరులతో కలిసి కొల్చారం పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సహకార సంఘం అధ్యక్షులు మన్నె రాములు (ఫైల్ ఫోటో)