Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedమరో శ్రీలంకగా తెలంగాణ...?

మరో శ్రీలంకగా తెలంగాణ…?

– పెరుగుతున్న అప్పులతో జనం గుండెల్లో గుబులు

– సమయానికి రాని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

– కొత్త పెన్షన్లు లేవు…పాత పెన్షన్లు సమయానికి రావు

– జాడలేని రేషన్ కార్డులు

– రైతుబంధు,కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో పెరిగిన అవినీతి

– ప్రభుత్వ పథకాల పక్కదారిపై పట్టింపు లేదు

మెట్ పల్లి, మే 19(ప్రజాకలం ప్రతినిధి):

తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక గా మారబోతుందా..?
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం జరగబోతుందా..?
అన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న అప్పులు తెలంగాణ భవిష్యత్తును ఇరకాటంలో పెట్టే ఈ విధంగా ఉన్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు పెరుగుతున్న అప్పులతో జనం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రం లో నివసిస్తున్న ఒక్కో వ్యక్తి తల పైన రూ. లక్షకు పైగా అప్పు ఉండడంతో మరో ఆందోళన నెలకొన్నట్లు అయింది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల రాష్ట్రంగా మారడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఆలస్యమవుతున్నాయి. కొత్త పెన్షన్ లు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు జిల్లాల వారీగా, వంతుల వారీగా జీతాలిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం ఓటు బ్యాంక్ కోసం టీఆర్ఎస్ సర్కార్ లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి, అనర్హులని ఏరివేయకపోవడం వల్ల వేల కోట్ల రూపాయలు వృదా అవుతున్నాయన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసరా, కళ్యాణలక్ష్మి, రైతుబందు వంటి పథకాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టడం, అధికారులు, నాయకులు పట్టించుకోకపోవడం వల్ల క్రమంగా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితుండడంతో పాలకులకు ఏమి చేయాలో తోచడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

*పెరుగుతున్న అప్పులతో జనం గుండెల్లో గుబులు..*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తలకు మించిన భారం అవుతుండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కుప్పలుగా మారుతున్నాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పటికే 2.41 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి వడ్డీలు కట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఒక్కో వ్యక్తి తలపైన రూ. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న అప్పుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

*సమయానికి రాని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు..*

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రతి నెల ఒకటో తారీఖున ఉద్యోగుల ఖాతాల్లో పడే జీతాలు ప్రస్తుతం 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా రావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కేవలం జీతాల పైన ఆధారపడి ఎంతోమంది తమ బతుకు భారాన్ని మోస్తూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు.

*కొత్త పెన్షన్లు లేవు…పాత పెన్షన్లు సమయానికి రావు..*

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా పెన్షన్ లు వస్తున్నాయి. గత ఉమ్మడి రాష్ట్రంలో రూ. 200 నుంచి సాధారణ పెన్షన్లను రూ.1000 వరకు ప్రభుత్వం అందిస్తోంది. అయితే పెంచిన పింఛన్లు ప్రతి నెల ఒకటి నుంచి ఐదో తారీకు లోపు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉండగా 15వ తారీఖు వరకు కూడా పింఛన్లు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా కొత్త పెన్షన్లు కూడా మంజూరు కావడం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

*రైతుబంధు,కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల్లో పెరిగిన అవినీతి…*

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులకు కాకుండా అనర్హులకు కూడా సంక్షేమ పథకాలను ధారపోస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి,పథకాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కొందరు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒకటేమిటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి సంక్షేమ పథకంలో లబ్ధిదారులు గుర్తించాలంటే స్థానిక ప్రజాప్రతినిధికి, సంబంధిత ప్రభుత్వ అధికారికి ఎంతోకొంత ముట్టజెప్పితే గాని పని కావడం లేదన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.

*ప్రభుత్వ పథకాల పక్కదారిపై పట్టింపు లేదు..*

టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పడుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను అర్హులకే అందువలన ప్రభుత్వ లక్ష్యం స్థానికంగా నీరుకారిపోతుంది. అర్హులకు కాకుండా అనర్హులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేకు ఎలాంటి సమాచారం లేకుండా కొందరు కిందిస్థాయి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తనకు అనుకూలంగా ఉన్న ప్రజలకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

*జాడలేని కొత్త రేషన్ కార్డులు..*

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డులు మినహా ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకునే సైట్ ను తాత్కాలికంగా ఎన్నో రోజులుగా మూసివేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులను ముద్రించి ఇచ్చిన పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అతను కొత్త రేషన్ కార్డుల జాడే లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు..*

మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మెట్ పల్లి.

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తో ఉండేది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం ఇష్టం వచ్చిన రీతిలో అప్పులు చేసింది. అప్పులు తీర్చే మార్గం లేక ఆ డబ్బులను ప్రజల నుంచి చెల్లించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి పైన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రభావం భవిష్యత్తులో ఎంతగానో నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలో పేరుకుపోయిన అప్పుల నుంచి తెలంగాణను విముక్తి చేసే విధంగా పని చేయాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments