రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ తోనే సాధ్యం,రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
డిక్లరేషన్ గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్ నాయకులు
మల్లాపూర్,మే20,(ప్రజాకలం ప్రతినిధి)
ఇటీవల జరిగిన వరంగల్ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మల్లాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రేస్ డిక్లరేషన్ గోడ పత్రికలు వేసి రైతు డిక్లరేషన్ ను మండలంలోని ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి గడప గడపకు తీసుకెళ్తామని అన్నారు.ఈ సందర్భంగా మొగిలిపేట్ లో కాంగ్రెస్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు కార్యాలయంలో డిక్లరేషన్ గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ తోనే సాధ్యమని,రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ ఫిషేర్మెన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, ఎనడ్ల రాములు, మాసుల చిన్నయ్య, మామిడి రాజశేఖర్, జలీల్, ఇప్పగణేష్, కొమ్ముల చిన్నరెడ్డి, వర్ధ సురేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.