రచ్చబండతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్
మల్లాపూర్, మే21,(ప్రజాకలం ప్రతినిధి)
వరంగల్‌లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది.రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోస్ వచ్చింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో జూవ్వడి నర్సింగరావు కృష్ణారావు పాల్గొన్నారు.ముందస్తుగా గ్రామంలోని దళిత వాడలో జువ్వడి సోదరులు పర్యటించారు.దళితవాడలోని మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారి 8 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలో దళితుల బతుకులు ఇంకా బాగుపడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రచ్చబండ కార్యక్రమానికి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ 31వ వర్థంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు .ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌పై గ్రామస్తులతో జూవ్వడి సోదరులు ముఖాముఖి అయ్యారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి రచ్చబండలో ప్రజలతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15వేల రూపాయల సాయం, భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాదికి 12 వేలు అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.ఇక ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ధరణి స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకువస్తామని అన్నారు. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన అధికారలతో లాభసాటి వ్యవసాయం లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక తో రైతు కమిషన్ ఏర్పాటు, పంటలకు బీమా, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చెక్కర కర్మాగారాలు తెరిపించడం లాంటి అంశాలపై రైతులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు ,టిపిసిసి రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావు ,రాష్ట్ర నాయకులు మాజీ జడ్పీటీసి ఎలాల జలపతి రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు వాకిట సత్యం రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసి గడ్డం శ్రీనివాస్ రెడ్డి,మరిపెల్లి సత్తమ్మ మల్లయ్య ,మామిడి మంజుల లక్ష్మారెడ్డి, చిట్టాపూర్ సర్పంచ్ కడకుంట్ల సాయి కుమార్,ఓలల్లా శేఖర్, అడ్వకేట్ ఆఫీజ్,సుంకేట నారాయణరెడ్డి ,సామ మోహన్ రెడ్డి, కొత్తూరు నారాయణ రెడ్డి,పుండ్ర లక్ష్మారెడ్డి ,గాజుల రాజారెడ్డి, ఇట్టేడి నారాయణరెడ్డి,తిప్పిరెడ్డి అంజిరెడ్డి, వెంపేట లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు