మల్లాపూర్, మే23,(ప్రజాకలం ప్రతినిధి)
మెట్ పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు తీవ్రంగా ఖండించారు.మాజీ మంత్రివర్యులు అయినటువంటి జీవన్ రెడ్డి పై కవిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని కవితకు సూచించారు.గల్లీలో లడాయి చేస్తూ ఢిల్లీలో దోస్తాన్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మీ చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందని మీ మాటలను వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు పార్లమెంట్ లో అనేక ప్రజావ్యతిరేక బిల్లులకు తెరాస పార్టీ వారు ఆమోదం తెలిపారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై పెద్దలు జీవన్ రెడ్డి పై మాట్లాడడం సబబు కాదని అన్నారు తన ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి తానున్నానని చెప్పేందుకు చేసిన ప్రయత్నంలో భాగమని అన్నారు.
గత ఎన్నికల్లో ప్రచారంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పైన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఫ్యాక్టరీ మూసేసి ఇప్పుడు రచ్చబండ గురించి రైతుల గురించి మాట్లాడడం సబబు కాదని కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసినప్పుడు మీయొక్క తండ్రికి పెద్దలు జీవన్ రెడ్డి తోడ్పాడు మీకు కావలసి వచ్చిందని,ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని బీజేపీతో చీకటి ఒప్పందం కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన జీవన్ రెడ్డి పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సరికాదని ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని సుజిత్ రావు సూచించారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షులు అక్బర్ మామిడి రాజ శేఖర్ రెడ్డి జలీల్ నిగ రవి,బద్ధం సుధాకర్ ఎనేడ్ల రాంరెడ్డి లోక ప్రతాప్ జి సురేష్ గణేష్ రాజేందర్ అన్వర్ తదితరులు పాల్గొన్నారు.