Wednesday, July 6, 2022
Google search engine
HomeUncategorizedప్రజాసంఘాల జేఏసీ నియోజకవర్గ కమిటీ నియామకం*

ప్రజాసంఘాల జేఏసీ నియోజకవర్గ కమిటీ నియామకం*

అధ్యక్షులుగా సుతారి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా మండ స్వామి

జగిత్యాల ప్రతినిధి,మే26,(ప్రజాకలం)

మహనుబావులు మహత్మ జ్యోతిబాపు పూలే, అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో బాగంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులుగా సుతారి రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా మండ స్వామి, ఉపాధ్యక్షులుగా రాసకొండ పెద్ద దేవన్న ,రుద్ర రాంప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్మిగా పెద్దిరెడ్డి అశోక్, లీగల్ ఆడ్వజర్ గా వొటారికారి శ్రీనివాస్ లతో పాటు టిఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గా శనిగారపు రాజయ్య మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులను నియమిస్తున్నట్లు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ కార్యనిర్వాహక కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తెలిపారు.

కోరుట్లలోని సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగన్ని రక్షించుకోవడం, దళిత బహుజన ప్రజాసంఘాల అభివృద్ధే లక్ష్యం గా ముందుకు వెళ్లాలని ప్రావీణ్యం కలిగిన యువతను చైతన్య వంతం చేస్తు ప్రజాసంఘాలను బలోపేతం చేయాలన్నారు. ఎపి ప్రభుత్వం కొత్త జిల్లా లో బాగంగా ప్రకటించిన బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ను ఎదవిదిగా కొనసాగించాలని పేట భాస్కర్ కోరారు.ఈ సమావేశంలో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా నాయకులు బోనగిరి మల్లారెడ్డి, టిఏవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర రమేష్, మల్లాపూర్ టిపిఎస్ జేఏసీ అధ్యక్షులు ముద్దం చంద్ర ప్రకాష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పెంబి మంహెదర్,ఉపాద్యక్షులు సిద్ద బాలరాజు, నాయకులు సుతారి రాములు,మడపతి ప్రమోద్, షాహిద్ మహ్మద్ షేక్, పెద్ది రెడ్డి లక్ష్మణ్,కొడిచెర్ల గంగారాం, హన్మండ్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments