పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు సాగాలి
మన ఆలోచన కార్యాలయంలో పద్మశాలి కులస్తుల ఆత్మీయ_సమ్మేళనం
మన ఆలోచన వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు
పద్మశాలికులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో సభా అధ్యక్షుడు తడక యాదగిరి
హైదరాబాద్ నాగోల్, ఫిబ్రవరి 06, (ప్రజా కలం)
పద్మశాలి కుల మేధావులు, విద్యావేత్తలు, బీసీ ఉద్యమకారులతో మన ఆలోచన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వక్తలు చాలా మంచి విషయాలను పాలుపంచుకోవడం జరిగింది. మనం శాస్త్రీయంగా ముందుకి వెళ్ళి మన లక్ష్యాలను చేరుకోవాలంటే, మన పద్మశాలీయుల లక్షణాలను అర్ధం చేసుకోవాలని మన ఆలోచన వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు,
పద్మశాలికులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో సభా అధ్యక్షుడు తడక యాదగిరి అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కార్పొరేట్ రంగంలో చేసే స్వట్ ఎనాలిసిస్ చేస్తే, సంపూర్ణంగా మనం లక్ష్యాలవైపు వెళ్లగలం.. ఈ స్వట్ ఎనాలిసిస్ , ఈ వాట్సాప్ గ్రూప్ ఆధారంగా కూడా చేయవచ్చు స్వట్ ఎనాలిసిస్ అంటే, ఒక మనిషిలో, ఒక కులంలో, ఒక సంఘం మనకున్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, భయాలు రావచ్చనుకొనే ప్రమాదాలను సరిగ్గా బేరీజు వేసుకొని, ముందుకు వెళ్ళితే విజయం తధ్యం అవుతుందని పద్మశాలియుల బలాలు (స్ట్రెంగ్త్స్ ) పద్మశాలియులు తెలివికలవారు (అందుకే వేరే కులాల నుంచి గెలిచిన నాయకులు, పద్మశాలి కులస్తులను దగ్గర వుంచుకుంటారు – సరైన సమయంలో సరైన సలహా యివ్వడానికి, సెక్రటేరియల్ అసిస్టెన్స్ అందించడానికి పద్మశాలియులు సౌమ్యులు, గొడవలకి వెళ్ళే రకం కాదు, పద్మశాలియులకున్న మరొక్క బలం – సంఖ్య పద్మశాలియుల జనాభా పద్మశాలియుల బలహీనతలు (వీక్నెస్సెస్ ) పద్మశాలియులు కొంచెం భయస్తులు, వున్న వృత్తిలోనే స్థిరపడిపోవాలనే సంకల్పం వున్నవారు. భయం, బిడియం చేత నాయకత్వ లక్షణాలను ప్రదర్శించలేని నిస్సహాయత స్థితి ఏమో చాలామంది పద్మశాలీలు యిప్పటికీ పేదరికంలోనే వున్నారు, తర్వాత మద్యతరగతి లో వున్నారు. మిడిల్ క్లాస్, ధనవంతులు వున్నా, వారి శాతం చాలా తక్కువ, వీరు తమ తమ వృత్తి, వ్యాపారాలలో నిమగ్నమైవున్నారు, వారికి రాజకీయాలమీద ఆసక్తి లేదు. మన కులం నుంచి ఎవరైనా ఎన్నికలలో పోటీచేస్తే, పద్మశాలి ధనవంతులు వారికి ఆర్దిక సహాయం చేస్తారా?అంటే (అనుమానమే!
పద్మశాలియులకున్న అవకాశాలు (ఒప్పోర్ట్యూనిటీస్ )స్వతహాగా ఎంతో తెలివిగల పద్మశాలీలు భయాలు, బిడియాలు పక్కన పెట్టి ముందుకి సాగితే, విజయాలు సాగిలపడతాయి. ఎక్కువ జనాభా వున్న మన కులస్తులను ఒక్క త్రాటిమీదకు తీసుకురాగలితే, మన పద్మశాలీలు ఎంతో మంది వివిధ రంగాలలో (ముఖ్యంగా రాజకీయాలలో) విజయాలను సాధించడానికి అవకాశాలు వుంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది పద్మశాలీలు ఆర్దికంగా చాలా అభివృద్ధి చెందడం జరిగింది (ముఖ్యంగా పట్టణాలు, నగరాలలో), కావున ప్రస్తుత రాజకీయ ప్రస్తానంలో మనగలగడానికి, ఎన్నికలలో పోరాడడానికి ఈ ఆర్ధిక అభివృద్ధి దోహదం చేస్తుంది.భయాలు రావచ్చనుకొనే ప్రమాదాలు (త్రీట్స్ )ఫార్వర్డ్ క్యాస్టస్ లో లాగా మనకు మన తాతలు, ముత్తాతలు, తండ్రులనుంచి వచ్చిన ఆస్తులు, అంతస్తులు చాలా చాలా తక్కువ. ఏమైనా మనకు యిప్పుడు ఆస్తులు, అంతస్తులు వున్నాయంటే అవి మనం స్వంతంగా సంపాదించుకున్నవైనా వుండాలి లేదా కొంచెం మన తండ్రులయినా వచ్చి వుండాలి. అందుచేత రాజకీయాలు వృత్తిగా స్వీకరించి, రేపు ఏదైనా తారుమారు ఐతే, పరిస్తితి ఏమిటి అనే భయాలు, మన పద్మశాలీయులను అటువైపు వెళ్ళకుండా చేస్తున్నాయేమో ఇవి పద్మశాలియుల స్వట్ ఎనాలిసిస్ లో కొన్ని విషయాలు మాత్రమే.. మీరు కూడా ఈ విశ్లేషణ (ఎనాలిసిస్ )కి మీ విలువైన, సమంజమైన అభిప్రాయాలను జోడించగలరు. దానితో మనం ముందు చెప్పినట్లుగా శాస్త్రీయంగా ముందుకి వెళ్ళి మన లక్ష్యాలను చేరుకోవాడానికి అవకాశం వుంటుంది. మన ఆలోచన పద్మశాలి
ఆధ్వర్యంలో, ఫిబ్రవరి 01-02-2025 నుండి 09-02-2025 వరకు, జరిగే వివిధ కుల సంఘల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈరోజు నాగోల్ లోని, మన ఆలోచన ప్రధానకార్యాలయoలో, మన ఆలోచన వ్యవస్థాపకులు శ్రీ కటకం నర్సింగ్ రావు గారి అధ్వర్యంలో జరిగిన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో సభా అధ్యక్షులు, తడక యాదగిరి గారు, నక్క కాశినాథ్ , సిలివేరు కాశినాథ్ , దొంత ఆనందం , గాజుల శ్రీహరి , బాసబత్తిని రాజేశం , పెండం లక్ష్మణ్ , సీనియర్ అడ్వాకేట్ బూర శంకర్ , డాక్టర్ గుర్రం నర్సింహా నేత , తీరాందాస్ యాదగిరేంద్ర , ఏలే పురేందర్ , గుండేటి శ్రీధర్ , మాకా సత్యనారాయణ , వడ్డేపల్లి శ్రీధర్ , వడ్డేపల్లి రామకృష్ణ, చెరుకు స్వామి, కోమటి సత్యనారాయణ, పుట్ట పాండురంగయ్య, చిక్క చందు, కటకం సుభాష్ , శేఖర్ (ప్రజాశక్తి) , బాలెన్ నరసింహ, ప్రేమ్ సాగర్ గారు, బిక్క శ్రీనివాస్ పద్మశాలి కుల మేధావులు, విద్యావేత్తలు, బీసీ ఉద్యమ కారులకు పాల్గొన్నారు.
పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు సాగాలి
Recent Comments
Hello world!
on