యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో
సరూర్ నగర్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్(మత్తు పదార్థాల) పై అవగాహన కార్యక్రమము
హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ప్రజాకలం):
పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉంటే వారి భవిష్యత్తు బాగుపడడంతో పాటు దేశము పురోభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి రమేష్ అన్నారు.
శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సరూర్నగర్ నందు విద్యార్థులకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల(డ్రగ్స్) నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ వాడడంవల్ల కలిగే నష్టాలను డిఎస్పి రమేష్ వివరించారు. చిన్నవయసులో డ్రగ్స్ బారినపడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యావేత్త మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నట్లు ఉన్నతమైన కలలు కనాలని వాటిని సార్థకం చేసుకోవడానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఉన్నతమైన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని గొప్ప శాస్త్రవేత్తలుగా, క్రీడాకారులుగా, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నతోద్యోగాలు సాధించి దేశ సేవ చేయడానికి కృషి చేయాలని, తల్లిదండ్రుల గౌరవం పెంపొందేల మీ ప్రవర్తన ఉండాలని అన్నారు.
నార్కోటిక్స్ బ్యూరో ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ
చెడు అలవాట్లు ఉన్నవారితో స్నేహం జీవితానికి చేటు చేస్తుందని అలాంటి వారికి దూరంగా ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలతో కూడిన వీడియోలు పిల్లలకు చూపించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి అరుణాదేవీ, ఎస్.మధుసూదన్, పి శేఖర్ రెడ్డి, భాగ్య, రాణి, సునీత, విజయశ్రీ, యశోధర, వెంకటేష్, నారాయణ,రామచంద్రుడు, భాస్కర్, సత్తయ్య, కవిత, డి రాధ, శోభ , కే ఉమాదేవి, జి పద్మ, బి అరుణ, ఎస్ ఇందిర, ఎం స్వర్ణలత, మరియమ్మ, రోజా, సునీత, కే లలిత, ఏ రాధ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు డ్రగ్స్(మత్తు పదార్థాల) పై అవగాహన
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on